ఘనంగా జనసేన ఆవిర్బావ దినోత్సవ వేడుకలు…

ఘనంగా జనసేన ఆవిర్బావ దినోత్సవ వేడుకలు…

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉరవకొండలో శనివారం జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ గౌతమ్ కుమార్ ఆధ్వర్యంలో ఉరవకొండ పట్టణంలోని ఊరగాద్రి చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. జనసేన పార్టీ కార్యాలయం లో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. స్థానిక సర్వజన ఆసుపత్రిలో రోగులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా గౌతమ్ కుమార్ మాట్లాడుతూ 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలో అడుగు పెడుతున్న, జనసేన పార్టీ కార్యకర్తలకు నాయకులకు వీర మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. 150 మందితో పార్టీ ప్రారంభమై నేడు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర , కేరళ, తమిళనాడు వివిధ రాష్ట్రాల్లో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం ద్వారా అన్ని రాష్ట్రాల్లో జనసేన పార్టీ జెండా ఎగురవేస్తున్న, ఈ తరుణంలో నీ 13వ జనసేన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఉరవకొండలో చేయడం సంతోషంగా ఉందని, అలాగే ఇప్పుడు జరుగుతున్నటు వంటి, జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా ఉరవకొండ నియోజకవర్గంలో కూడా పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు క్రియాశీల సభ్యత నమోదు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు.

జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు సాధకులు అందరూ మరింత బాధ్యతగా తీసుకొని, అత్యధిక సంఖ్యలో సభ్యత్వం చేయాల్సిందిగా కోరారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఇంత ఘనంగా జరుపుకోవడం కోసం సహకరించిన, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉరవకొండ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, జనసేన నాయకులు రాజేష్, రమేష్, మధు, మణి కుమార్, అనిల్, బోగేష్, రమణ, తిలక్, శేఖర్, రఘు, అభి, ధనుంజయ, కృష్ణ పాల్గొన్నారు.

Leave a Reply