bcci | అత్యుత్తమ సేవలకు అవార్డులు

bcci | అత్యుత్తమ సేవలకు అవార్డులు
రోజర్ బిన్నీ, రాహుల్ ద్రావిడ్, మిథాలీ రాజ్‌కు లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డు
ప్రకటించిన బీసీసీఐ
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : భారత క్రికెట్ దిగ్గజాలకు అరుదైన గౌరవం లభించింది. ఆటగాళ్లుగా, కోచ్‌లుగా, నిర్వాహకులుగా భారత క్రికెట్ ఎదుగుదలకు వీరు అందించిన సేవలను బీసీసీఐ పురస్కారాల ద్వారా గుర్తించింది. ప్రతిష్టాత్మక ‘నమన్ అవార్డులు-2026’లో భాగంగా టీమిండియా మాజీ ఆటగాళ్లు రాహుల్ ద్రవిడ్, రోజర్ బిన్నీలతో పాటు మహిళా క్రికెట్ ఐకాన్ మిథాలీ రాజ్‌కు జీవిత సాఫల్య పురస్కారాలు ప్రకటించింది. న్యూఢిల్లీలో మార్చి 15వ తేదీన ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు.

పురుషుల విభాగంలో బీసీసీఐ అత్యున్నత పురస్కారమైన ‘కల్నల్ సీకే నాయుడు జీవిత సాఫల్య పురస్కారా’న్ని రాహుల్ ద్రవిడ్, రోజర్ బిన్నీలకు అందజేయనున్నారు. మహిళల క్రికెట్‌కు మిథాలీ రాజ్ చేసిన విశేష సేవలకు గాను ఆమెకు ‘బీసీసీఐ జీవిత సాఫల్య పురస్కారా’న్ని బహూకరించనున్నారు. వీరితో పాటు 2024-25 సీజన్‌కు గాను ప్రస్తుత ఆటగాళ్లకు కూడా అవార్డులు ప్రకటించారు. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రెండోసారి ‘పాలి ఉమ్రిగర్ అవార్డు’ (ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ – పురుషులు) అందుకోనుండగా, స్మృతి మంధానా ఐదోసారి ఉత్తమ అంతర్జాతీయ మహిళా క్రికెటర్‌గా నిలిచారు. ఇటీవల ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఐదు భారత జట్లను (సీనియర్ పురుషుల, మహిళల, అండర్-19 జట్లు) బీసీసీఐ ఒకే వేదికపై ఘనంగా సత్కరించనుంది.
