పుట్టెడు దుఃఖంలో పరీక్షకు హాజరు…

శివ్వంపేట, ఆంధ్రప్రభ : తండ్రి చనిపోయి శనివారం అంత్యక్రియలు జరగాల్సి ఉండగా పుట్టెడు దుఃఖంలో కొడుకు పదవ తరగతి పరీక్షకు హాజరైనా సంఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలం పాంబండ గ్రామంలో జరిగింది. పాంబండ గ్రామానికి చెందిన కుమ్మరి నాగరాజు (45) తన భార్యతో కలిసి తుప్రాన్ కి వెళ్లి తిరిగి వస్తుండగా ఉసిరికపల్లి వద్ద బైకు అదుపుతప్పి కింద పడి తండ్రి మృతి చెందగా తల్లి అంజమ్మకి తీవ్రగాయాలు అయ్యి చికిత్స పొందుతుంది. శనివారం తండ్రి అంత్యక్రియలు జరగాల్సి ఉండగా.. కొడుకు ధనుష్ (16) పుట్టెడు దుఃఖంలో ఏడ్చుకుంటూనే తూప్రాన్ లో పదవ తరగతి పరీక్షకు హాజరయ్యాడు. పుట్టెడు దుఃఖంలోను పరీక్షకు హాజరైనా ధనుష్ ని చూసి స్థానికులు కంటాతడి పెట్టారు.
