పదవ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ ; కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని జడ్పి హెచ్ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎస్ఎస్సి పరీక్షా కేంద్రంలో, పదవ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు చీఫ్ సూపరింటెండెంట్ కె. గంగాధర్,డిపార్ట్ మెంటల్ ఆఫీసర్ కృష్ణ కుమార్,పాఠశాల ప్రధానోపాధ్యాయులు పసుపుల సాయన్న శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పరీక్షలు రాయబోయే విద్యార్థుల హాల్ టికెట్ నంబర్లను పరిశీలిస్తూ,పరీక్షలు సజావుగా, క్రమబద్ధంగా నిర్వహించేందుకు, అలాగే ఇన్విజిలేషన్ బృందం సభ్యులు సమగ్రంగా పర్యవేక్షణ నిర్వహించినట్లు తెలిపారు.
వారి పర్యవేక్షణలో పరీక్షా కేంద్రంలో అన్ని ఏర్పాట్లు సక్రమంగా జరిగి, విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోబడినట్లు తెలిపారు.కమ్మర్ పల్లి సెంటర్ లో మొత్తం విద్యార్థులు 193,ఇందులో తెలుగు మీడియంలో 18 మంది విద్యార్థులు,ఇంగ్లీష్ మీడియంలో 175 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు అవుతారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇన్విజిలేటరు లు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
