నీలం మధుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మల్లికార్జున ఖర్గే

నీలం మధుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మల్లికార్జున ఖర్గే

  • ఢిల్లీలో ఖర్గే ఆశీస్సులు తీసుకున్న నీలం మధు ముదిరాజ్
  • బీసీల రాజకీయ అవకాశాలు, సామాజిక స్థితిగతులపై చర్చించిన ఖర్గే
  • ప్రజల్లోకి పార్టీ కార్యక్రమాలు మరింత బలంగా తీసుకెళ్లండి అంటూ సూచన
  • కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ మీకు ఎల్లవేళలా ఉంటుందని భరోసా

సంగారెడ్డి, ఆంధ్రప్రభ : మధుజీ జన్మదిన ముబారక్ అంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి నీలం మధు ముదిరాజ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈనెల 14న తన జన్మదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం నీలం మధు ముదిరాజ్ ఢిల్లీ రాజాజీ మార్గ్ లోని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి, శాలువతో సత్కరించి ఆశీస్సులు తీసుకున్నారు.

ఈ సందర్భంగా మల్లికార్జున ఖర్గే నీలం మధును ఆప్యాయంగా పలకరించి ఆశీర్వదించారు. బీసీల సంక్షేమం, రాజకీయ అవకాశాలు, సామాజిక స్థితిగతులు, రానున్న రోజుల్లో పార్టీ, ప్రభుత్వ అవకాశాలపై చాలా సేపు ఆయన మాట్లాడారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తుందని కొనియాడారు. ఎప్పటికప్పుడు ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా తీసుకెళ్తూ ప్రజలతో మమేకం కావాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి నాయకుడికి పార్టీ మద్దతు ఎల్లవేళలా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం నీలం మధు ఏఐసీసీ అధ్యక్షుడి ఆశీస్సులు తీసుకొని ధన్యవాదాలు తెలిపారు.