PNG | క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు

PNG | క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు

PNG | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : వంట గ్యాస్ కొరతపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. LPG బదులు ప్రజలు PNG తీసుకోవాలని సూచించింది. దేశంలో గ్యాస్ సంక్షోభం లేదని స్పష్టం చేసింది. 30 శాతం LPG ఉత్పత్తిని పెంచినట్లు వెల్లడించింది. అలాగే భారత్‌లో పెట్రోల్ కొరత కూడా లేదని తెలిపింది. ప్రజలు ఆందోళన చేందవద్దని చెప్పింది. బ్లాక్ మార్కెట్‌పై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. రాష్ట్రాలకు కిరోసిన్ కూడా కేటాయించినట్లు పేర్కొంది.

గ్యాస్‌ గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అవసరం లేకపోయినా ఆందోళనతో గ్యాస్‌ బుకింగ్‌లు చేయవద్దని కేంద్రం తెలిపింది. హర్మూజ్‌ జలసంధి వద్ద నౌకల్లో ఉన్న వారి భద్రత కోసం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. నౌకల్లో ఉన్న 23వేల మంది భద్రతకు 24 గంటల కంట్రోల్‌రూమ్ ఏర్పాటు, భారత్‌లోని పోర్టుల్లో కార్యకలాపాలు సాధారణంగానే ఉన్నాయని పేర్కొంది. రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ వెళ్తున్నాం… గల్ఫ్‌ నుంచి లక్షన్నర మందిని వెనక్కి తీసుకువచ్చామని కేంద్రం తెలిపింది.

Leave a Reply