రెండో శనివారం విద్యా సంస్థలు పని చేయాలి..

రెండో శనివారం విద్యా సంస్థలు పని చేయాలి..
మచిలీపట్నం, ఆంధ్రప్రభ : జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు ఈ నెల 14న రెండో శనివారమైనా సెలవు లేకుండా పని చేయాలని జిల్లా విద్యా శాఖాధికారి సుబ్బారావు ఆదేశించారు. గతేడాది అక్టోబరులో మొంథా తుపాను సందర్భంగా అన్ని విద్యా సంస్థలకు కలెక్టర్ నాలుగు రోజుల పాటు సెలవు ప్రకటించారన్నారు. ఆ నాలుగు రోజుల సెలవులకు బదులుగా అన్ని విద్యా సంస్థలు ఇప్పటికే మూడు రోజులు పని చేశాయన్నారు. మిగిలిన ఒక రోజు సెలవుకు బదులుగా రాబోయే రెండో శనివారం అన్ని విద్యా సంస్థలు పని చేయాలని డీఈవో పేర్కొన్నారు.
