ముదిరాజ్ సంఘం ఫంక్షన్ హాల్‌లో తొలి వివాహం

నార్సింగి, ఆంధ్రప్రభ ; మండలంలోని భీమ్రావుపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో కొత్తగా నిర్మించిన ముదిరాజ్ ఫంక్షన్ హాల్‌లో తొలి వివాహ వేడుక ఘనంగా జరిగింది. నూతనంగా ఏర్పాటైన ఈ ఫంక్షన్ హాల్‌లో మొదటిసారిగా దంపతుల వివాహం జరగడంతో గ్రామస్థులు, సంఘ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మాజీ వార్డు సభ్యుడు బోయిని భూషణం మాట్లాడుతూ.. ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన ఈ ఫంక్షన్ హాల్ గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. భవిష్యత్తులో భీమ్రావుపల్లి గ్రామంలో జరిగే పెళ్లిళ్లు, శుభకార్యాలు అన్నీ ఈ ఫంక్షన్ హాల్‌లో సంతోషంగా జరగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, మరియు ప్రజలు పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు.

Leave a Reply