కావూరి సాంబశివరావు మృతిపై షర్మిల సంతాపం

కావూరి సాంబశివరావు మృతిపై షర్మిల సంతాపం
- ఐదు సార్లు ఎంపీగా సేవలందించిన నాయకుడని కొనియాడిన షర్మిల
- రాష్ట్ర రాజకీయాలకు కావూరి మరణం తీరని లోటు అని వ్యాఖ్య
విజయవాడ, ఆంధ్రప్రభ : మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు కావూరి సాంబశివ రావు మరణంపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా బుధవారం స్పందించిన ఆమె, కావూరి సాంబశివరావు మరణం రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు అని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుని ప్రార్థిస్తున్నానని తెలిపారు.
కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఐదు సార్లు ఎంపీగా ఎన్నికై యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర జౌళి శాఖ మంత్రిగా పనిచేసి ప్రజలకు విశేష సేవలందించారని కొనియాడారు. ప్రజా జీవితంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
