Battery cycle |దివ్యాంగుడికి బ్యాటరీ సైకిల్ అందజేత‌…

Battery cycle | దివ్యాంగుడికి బ్యాటరీ సైకిల్ అందజేత‌…

చిల్లకల్లు గ్రామానికి చెందిన షరీఫ్‌కు రూ.50 వేల విలువైన సైకిల్…
దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ఎమ్మెల్యే

Battery cycle | జగ్గయ్యపేట, ఆంధ్రప్రభ : జగ్గయ్యపేట నియోజకవర్గం చిల్లకల్లు గ్రామానికి చెందిన దివ్యాంగుడు షరీఫ్‌కు రూ.50 వేల విలువైన బ్యాటరీ సైకిల్‌ను ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ అందజేశారు. స్థానికంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన స్వయంగా సైకిల్‌ను షరీఫ్‌కు అందించి సహాయం చేశారు. కొద్ది రోజుల క్రితం గ్రామంలో పింఛన్ పంపిణీ కార్యక్రమానికి వెళ్లిన సందర్భంగా షరీఫ్ బ్యాటరీ సైకిల్ కోసం ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశాడు. ప్రభుత్వ నిల్వల్లో సైకిళ్లు అందుబాటులో లేకపోవడంతో వెంటనే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే నిర్ణయించారు.

ఈ నేపథ్యంలో నియోజకవర్గ దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు వడ్డెపూడి ఉమామహేశ్వరరావుకు సూచనలు ఇచ్చి సైకిల్ కొనుగోలు చేయించారు. ఎమ్మెల్యే అందజేసిన నిధులతో సైకిల్ కొనుగోలు చేసి షరీఫ్‌కు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ మాట్లాడుతూ, దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి దివ్యాంగులకు సహాయం చేస్తే వారి జీవితాల్లో మార్పు తీసుకురావచ్చని పేర్కొన్నారు. షరీఫ్‌కు త్వరగా సైకిల్ అందేలా కృషి చేసిన వడ్డెపూడి ఉమామహేశ్వరరావును ఆయన అభినందించారు.

Battery cycle |

దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు వడ్డెపూడి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే ఎప్పుడూ ముందుండి సహాయం చేస్తున్నారని తెలిపారు. దివ్యాంగుడికి స్వయంగా బ్యాటరీ సైకిల్ అందించి ఆదర్శంగా నిలిచారని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ అడుసుమల్లి ప్రభాకర్, మల్లెల కొండయ్య, దర్శి విజయ నరసింహారావు, కుకుట్ల రామలింగేశ్వరరావు, మారేపల్లి శౌరి, పసుపులేటి శ్రీనివాసరావు, గుమ్మ వెంకటేష్, పునుగుపాటి పుల్లారావు, నలజాల రాజు, గుమ్మ మధు, దివ్యాంగుల సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Battery cycle |

CLICK HERE TO READ MORE Ap Cs Task : క‌లిసి ప‌నిచేద్దాం Andhra Prabha News
CLICK HERE TO READ MORE

Leave a Reply