Ration rice | దోపిడీ వెనుక ఉన్నది అవినాష్ అనుచరులే

Ration rice | దోపిడీ వెనుక ఉన్నది అవినాష్ అనుచరులే

Ration rice | విజయవాడ, ఆంధ్రప్రభ : రేషన్ బియ్యం దోపిడీ వ్యవహారంలో పట్టుబడుతున్న వారంతా వైఎస్సార్ సీపీ నాయకుడు దేవినేని అవినాష్ అనుచరులేనని టీడీపీ ఎస్సీ, బీసీ, మైనార్టీ విభాగాల నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని ) పై అవినాష్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బుధవారం విజయవాడ గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.

జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ కరీముల్లా, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు సొంగా సంజయ్ వర్మ, టీఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి. చరణ్ సాయి యాదవ్ మాట్లాడుతూ… రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారంలో ఉన్న అయితా కిషోర్ సహా పలువురు అవినాష్ అనుచరులేనని ఆరోపించారు. నగరంలో బియ్యం మాఫియా, మట్టి మాఫియా వంటి అక్రమ కార్యకలాపాలకు అవినాష్ కుటుంబం పేరొందిందని విమర్శించారు. మూడు సార్లు ఎన్నికల్లో పోటీ చేసి గెలవలేకపోయిన అవినాష్ కన్ఫ్యూజన్‌లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని వారు ఎద్దేవా చేశారు.

Ration rice |
Ration rice |

కార్పొరేటర్‌గా కూడా గెలవలేని నాయకుడికి ప్రజల చేత భారీ మెజార్టీతో ఎన్నుకోబడిన ఎంపీని విమర్శించే స్థాయి లేదన్నారు. విజయవాడ పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో నిరంతర ప్రజాసేవ చేస్తూ నగరాభివృద్ధికి కృషి చేస్తున్న నాయకుడు ఎంపీ కేశినేని చిన్నినని పేర్కొన్నారు. నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ మహిళా సాధికారతకు, పేదల సంక్షేమానికి తన సొంత నిధులతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు.

Ration rice |
Ration rice |

వైఎస్సార్‌సీపీ నాయకులు అభివృద్ధి విషయాల్లో సహకరించకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు. విజయవాడ నగర అభివృద్ధిపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నాయకులకు లేదని పేర్కొన్నారు. అవినాష్ కుటుంబంపై నగరంలో భూకబ్జాలు, దౌర్జన్యాల ఆరోపణలు ఉన్నాయని, వాటిని కప్పిపుచ్చుకునేందుకు ఎంపీపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజల కోసం పనిచేస్తున్న నాయకుడిపై అవాకులు చవాకులు పేల్చితే సహించబోమని హెచ్చరించారు.

Ration rice |
Ration rice |

2029 ఎన్నికల్లో కూడా ప్రజాభిమానం ఉన్న నాయకుడిగా ఎంపీ కేశినేని చిన్నిని ఎదుర్కోవడం అవినాష్ వల్ల కాదని పేర్కొన్నారు. విజయవాడ నగరాభివృద్ధి కోసం అన్ని వర్గాలు కలిసి పని చేయాలని, వ్యక్తిగత ఆరోపణలతో రాజకీయాలు చేయవద్దని సూచించారు. విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు వి. వంశీ తదితరులు పాల్గొన్నారు.

CLICK HERE TO READ MORE : Dumping | పానిక్ హార్వెస్టింగ్ చేయొద్దు..

CLICK HERE TO READ MORE :