కల్తీ వ్యాపారులపై పిడి యాక్ట్ పెట్టాలి…

కల్తీ వ్యాపారులపై పిడి యాక్ట్ పెట్టాలి…
ఎంతటి వారినైనా శిక్షించాలి
గ్రేటర్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి
కరీమాబాద్, ఆంధ్రప్రభ : కల్తీ వ్యాపారులపై పీడీ యాక్ట్ పెట్టాలని గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న కల్తీ దందాలను ప్రభుత్వం వెంటనే అరికట్టాలని కల్తీ చేసేవారు ఎంతటి వారైనా వారిపై పీడి యాక్ట్ పెట్టి కఠినంగా శిక్షించాలని రాజనాల శ్రీహరి కోరారు. కల్తీ చేసే వారిని పట్టుకుని డబ్బులు తీసుకుని వారిని విడుదల చేసే అధికారులు ఉన్న అలాగే ఎంతటి రాజకీయ నాయకులైన వారి ప్రమేయం ఉన్న వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని రాజనాల అన్నారు.
ప్రస్తుతం చిన్న చిన్న దుకాణాల దగ్గర నుండి పాలు, టీ పొడి, అల్లం పేస్ట్, వెల్లుల్లి పేస్ట్, వంట నూనెతో పాటు అనేక నిత్యవసర వస్తువులలో కల్తీ జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల మందుల్లో కూడా కల్తీ జరుగుతుందని సమాచారం వస్తుందని ఇలాంటి కల్తి వస్తువులను తయారు చేసే కేంద్రాలు కూడా అనేకం ఉన్నాయని వాటిని వెంటనే గుర్తించి నియంత్రించకపోతే రాబోయే రోజుల్లో ప్రజలు తీవ్రమైన అనారోగ్య సమస్యలకు గురయ్య ప్రమాదం ఉందని ఆయన తెలిపారు.
వెంటనే ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులను నియమించి కల్తీ వ్యాపారం చేసే వారందరిని పట్టుకొని వారిపై పీడియాక్ట్ పెట్టి కఠినంగా శిక్షించాలని రాజనాల శ్రీహరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
