మత్తు పదార్థాలను విక్రయిస్తే..

మత్తు పదార్థాలను విక్రయిస్తే..
అవుకు రూరల్, ఆంధ్రప్రభ : యువత చెడు వ్యసనాలకు అలవాటు పడితే.. బంగారు భవిష్యత్తు చిన్నాభిన్నమవుతుందని అవుకు ఎస్సై అశోక్ పేర్కొన్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వజ్రపహార్ కార్యక్రమాన్ని సిబ్బందితో కలిసి ఎస్సై నిర్వహించారు. పట్టణంలోని పలు అనుమానిత దుకాణాలను తనిఖీ చేశారు. మత్తు పదార్థాలను విక్రయిస్తే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని దుకాణ యజమానుదారులకు ఎస్సై తెలియచేశారు. మైనర్లకు మత్తు పదార్థాలను విక్రయించరాదన్నారు.
