వికారాబాద్ రైల్వే స్టేషన్‌లో కోతులు, కుక్కల బెడద

వికారాబాద్, ఆంధ్రప్రభ : గతంలో అడవులకు అనంతరం గ్రామాలకు చేరుకున్న కోతులు ప్రభంగా పట్టణ ప్రాంతాలకు సైతం విస్తరిస్తున్నాయి. తాజాగా వికారాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే జంక్షన్ లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై ఓవైపు కుక్కలు మరోవైపు కోతులు దర్శనమిచ్చాయి. ఈ కారణంగా ఫుడ్ ఓబ్రిడ్జిపై ప్రయాణికులు వెళ్లేందుకు భయపడుతున్నారు.

అడవి ప్రాంతం నుండి గ్రామీణ ప్రాంతాలకు ప్రధానంగా రైతుల పండించిన పంటలను నాశనం చేస్తున్న కోతులు క్రమంగా పట్టణ ప్రాంతాలకు విచ్చేస్తున్నాయి. ఇప్పటికే వికారాబాద్ జిల్లాలోని ధరూర్ బంటారం నవపేట్ మండలాల్లో కోతులు బాగా ఉండగా ఇందుకు సంబంధించి చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్లమెంట్లో ప్రస్తావించి కోతులు పట్టేందుకు ప్రత్యేక కార్యచరణ రూపొందించారు. కొన్ని మండలాల్లో కోతులు పట్టే కార్యక్రమం ప్రారంభం కాగా పట్టణ ప్రాంతాలకు విచ్చేసిన కోతులను ఎలా పడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

Leave a Reply