Terrible incident | కన్న కొడుకునే…

Terrible incident | కన్న కొడుకునే…

Terrible incident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కన్న కొడుకు చెడు వ్యసనాలకు బానిసయ్యాడన్న ఆవేదన, కోపంతో ఓ తండ్రి అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. గంజాయికి అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడన్న ఆగ్రహంతో తన 23 ఏళ్ల కుమారుడిని గొడ్డలితో నరికి చంపేశాడు (Murder).

ఈ ఘటన ఇందల్వాయి (Indalwai) మండలం నల్లవెల్లి గ్రామంలో జరిగింది. కుమారుడిని హతమార్చిన తర్వాత నిందితుడు కొత్తగొల్ల కిషన్ (Kothagolla Kishan) నేరుగా ఇందల్వాయి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. తాను చేసిన పనిని పోలీసులకు వివరించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దారుణ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

Leave a Reply