Kondapaka | పాపం ప్రియుడు…

Kondapaka | పాపం ప్రియుడు…
Kondapaka | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : సిద్దిపేట జిల్లా (Siddipet District) లో ప్రేమ విఫలమైన బాధలో మరో యువకుడు ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన చోటుచేసుకుంది. కొండపాక (Kondapaka) మండలం వెలికట్ట శివారులోని ఓ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్న ప్రదీప్ కుమార్ (25) తన ప్రేమికురాలు దూరమైందన్న వేదనతో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ప్రాణాలు వదిలేశాడు.
ఏడాది క్రితం తనతో కలిసి పనిచేసిన యువతి ఉద్యోగం మానేసి వెళ్లిపోయిన తర్వాత నుంచి ప్రదీప్ మానసికంగా కుంగిపోయి ఆందోళనకు గురవుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. యూపీకి చెందిన ప్రదీప్ (Pradeep) దుద్దెడలో నివాసం ఉంటూ ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
