Pawan| జంతు సంరక్షణకు శ్రీకారం

Pawan| జంతు సంరక్షణకు శ్రీకారం
ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : మానవ- వన్యప్రాణి సంఘర్షణను నివారించడం కోసం కూటమి ప్రభుత్వం హనుమాన్ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టింది. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సారథ్యంలో ప్రాజెక్ట్ హనుమాన్‌ను ప్రారంభించింది. మంగళగిరిలో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాన్ ప్రసంగించారు. చిత్తూరు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఎక్కడైతే ఏనుగులు, ఇతర వన్యప్రాణులు గ్రామాల్లోకి ప్రవేశించి ప్రజల ప్రాణాలకు, వ్యవసాయానికి ఇబ్బందులు కలిగించే పరిస్థితులు ఉన్నాయని, అలాంటి చోట్ల వీటిని ఎలా అదుపు చేయాలనే ఆలోచన నుంచే ఇది పుట్టిందే హనుమాన్ ప్రాజెక్ట్ అని పేర్కొన్నారు.
వన్యప్రాణులను సంరక్షిస్తూనే మరోవంక వాటి బారి నుండి ప్రజల ప్రాణాలు, పంటలు, పశువులు, ఆస్తులను పరిరక్షించడమే ఈ హనుమాన్ ప్రాజెక్ట్ ప్రధాన కర్తవ్యమని చెప్పారు. దీనికోసం గ్రామీణ స్థాయంలో పంచాయితీరాజ్, వ్యవసాయ, ఉద్యాన వనాలు, రెవెన్యూ, పోలీస్ శాఖలతో పాటు ఇతర విభాగాతో సమన్వయం చేసుకుంటామని, ఈ ప్రాజెక్ట్ ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారి జీపీఎస్ ట్రాకింగ్ వంటి పూర్తి సాంకేతికతతో కూడిన 100 వాహనాలను ప్రారంభించామని గుర్తుచేశారు. ఇందులో 93 రాపిడ్ రెస్పాన్స్ అండ్ రెస్క్యూ టీమ్ వెహికల్స్, వైల్డ్ లైఫ్ అంబులెన్సు ఏడు ఉన్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వన్యప్రాణుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి, నష్టపోయిన పంటలకు ఇచ్చే నష్టపరిహారాన్ని గణనీయంగా పెంచామని, అంతకు ముందు అయిదు లక్షల రూపాయలు ఉంటే తాము వచ్చాకా దీన్ని 10 లక్షలకు పెంచామని గుర్తు చేశారు. గాయపడినవారికి పరిహారం మొత్తాన్ని రెండు లక్షలు నిర్ణియించామని తెలిపారు. పశువులు చనిపోతే మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం చెల్లిస్తున్నామని అన్నారు.
వన్యజీవి రక్షక్ అనే వాలంటనీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టబోతున్నామని, వీరికి రెస్క్యూ కిట్లు అందిస్తున్నామని చెప్పారు. గ్రామస్థాయిలో పాములు, ఇతర జంతువుల నుండి ఎదురయ్యే సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేలా శిక్షణ ఇస్తున్నామని అన్నారు. వాలంటీర్లుగా స్థానిక యువతకు అవకాశాలు ఇస్తామని పవన్ స్పష్టం చేశారు.
