Earthquake | తీవ్రత 4.3గా నమోదు

Earthquake | తీవ్రత 4.3గా నమోదు

Earthquake | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధ ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్రమవుతున్న వేళ… ఇరాన్ లోని గెరాష్ ప్రాంతంలో 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూమికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు నమోదయ్యాయని ఇరాన్ వాతావరణ శాఖ తెలిపింది.

ఇప్పటికే యుద్ధ భయాలు, దాడులు, ప్రతీకారాల మధ్య ఉద్రిక్తంగా ఉన్న ప్రాంతీయ పరిస్థితులకు ఈ భూకంపం మరింత ఊపిరి పోసినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం భూకంపం వల్ల ఆస్తి నష్టం, ప్రాణ నష్టం గురించి అధికారిక సమాచారం ఇంకా అందాల్సి ఉంది. ఈ ఘటన ఇరాన్‌లోని ఇతర ప్రాంతాల్లో కూడా ఆందోళనలు రేపింది.

Leave a Reply