వరంగల్, నర్సంపేట ప్రధాన రహదారి ట్రాఫిక్ మళ్లింపు

గీసుగొండ, ఆంధ్రప్రభ : వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలోని ప్రసిద్ది గాంచిన కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం జాతరలో భాగంగా ప్రభ బండ్ల దృష్ట్యా వరంగల్ నర్సంపేట ప్రధాన రహదారిపై తాత్కాలిక ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టినట్టు ఇన్స్పెక్టర్ విశ్వేశ్వర్ తెలిపారు. సి ఐ తెలిపిన వివరాల ప్రకారం గత ఏడాదిని దృష్టిలో పెట్టుకొని ఈ సారి ట్రాఫ్ఫక్ సమస్యలు తలెత్తకుండా నేటి సాయంత్రం 4 గంటల నుంచి రేపు రాత్రి వరకు మార్పులు కొనసాగుతాయని తెలిపారు.
వరంగల్ వయా నర్సంపేట
వరంగల్ నుంచి నర్సంపేటకు వెళ్లే వాహనాలు క్రింది మార్గాన్ని అనుసరించాలి : మచ్చాపూర్, పల్లరిగూడ, మొండ్రాయి, కొత్తపల్లి, ఉప్పరపల్లి, కోనాపురం, చెన్నారావుపేట గ్రామాల మీదుగా నర్సంపేట చేరుకోవాలి.
నర్సంపేట వయా వరంగల్
నర్సంపేట నుంచి వరంగల్ వైపు వచ్చే వాహనాలు: గిర్నిబావి, నాచనపల్లి, లక్ష్మీపురం, ఎల్కుర్తి, మచ్చాపూర్, మార్గం ద్వారా వరంగల్ చేరుకోవాలి. జాతర వేళ భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఈ మార్పులు చేపట్టినట్లు ఇన్స్పెక్టర్ విశ్వేశ్వర్ తెలిపారు.
