సిద్ధిరామేశ్వర ఆలయం మూసివేత…

బిక్కనూర్, ఆంధ్రప్రభ ; దక్షిణ కాశిగా పేరుపొందిన కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండల కేంద్రంలో గల సిద్ధిరామేశ్వర ఆలయాన్ని మూసివేయడం జరిగిందని ఆలయ అర్చకులు, కొడగండ్ల రామకృష్ణ కొడగండ్ల సిద్ధగిరి శర్మ న్యాల కంటి రాజేశ్వర శర్మలు తెలిపారు. చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని ఆలయంలో ఉదయం ఎనిమిది గంటలకు ప్రాంతకాల పూజ నిర్వహించడం జరిగిందన్నారు.

అనంతరం ఆలయాన్ని మూసివేసినట్లు చెప్పారు. తిరిగి బుధవారం ఉదయం ఆలయ సంప్రోక్షణ అనంతరం భక్తుల దర్శనానికి అనుమతించపడుతుందని వారు తెలిపారు. ఇట్టి విషయాన్ని భక్తులు గమనించాలని సూచించారు. ఆలయ కార్యనిర్వాహన అధికారి శ్రీధర్ సూచనల మేరకు ఇట్టి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది లక్ష్మీనారాయణ, గోపి లక్ష్మి తదితరులు ఉన్నారు.

Leave a Reply