కాంగ్రెస్ గ్రామ కమిటీ ఏకగ్రీవ ఎన్నికతో ఆకులతండాలో ఉత్సాహం

కాంగ్రెస్ గ్రామ కమిటీ ఏకగ్రీవ ఎన్నికతో ఆకులతండాలో ఉత్సాహం

నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ: నర్సంపేట మండలం ఆకులతండా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బానోత్ రామునాయక్, మాజీ సొసైటీ డైరెక్టర్ దామెర రవి, ఉపసర్పంచ్ మూడు మంగు, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తల సమక్షంలో ఎన్నికలు ఘనంగా నిర్వహించారు.

గ్రామ పార్టీ అధ్యక్షుడిగా కన్నెబోయిన శ్రీశైలం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా మూడు ఈర్య, వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నానబోయిన యాదవరాజు, మూడు సంగులాల్, కార్యదర్శిగా మూడు రవి, ప్రధాన కార్యదర్శిగా వంగ రాజు, కోశాధికారిగా ధరావత్ వెంకన్నలను ఎన్నుకున్నారు. ముఖ్య సలహాదారులుగా రాధారపు సంపత్, ధరావత్ హరి సింగ్, నాన్నబోయిన మొగిలి, కేశబోయిన చిరంజీవి, మూడు చిన్న నరసింహలను నియమించారు.


ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు కన్నెబోయిన శ్రీశైలం మాట్లాడుతూ గ్రామంలో పార్టీ బలోపేతానికి కట్టుబడి పనిచేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామ అభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదల, యువతకు ఉపాధి అవకాశాల కల్పన, పేదల సంక్షేమం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని వెల్లడించారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అండదండలతో ఆకులతండాను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని నాయకులు పేర్కొన్నారు. గ్రామ ప్రజలు ఐక్యంగా సహకరిస్తే అభివృద్ధి సాధ్యం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, ఎస్టీ, బీసీ సెల్ నాయకులు, గ్రామ ప్రముఖులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన కమిటీకి అభినందనలు తెలిపారు. ఆకులతండాలో కాంగ్రెస్ పార్టీకి బలమైన పునాది ఏర్పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Leave a Reply