Devisri prasad | రెమ్యూనరేషన్ భారీగా పెంచేశారా..?

Devisri prasad | రెమ్యూనరేషన్ భారీగా పెంచేశారా..?
Devisri prasad | రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ రెమ్యూనరేషన్ పెంపు.. నిర్మాతలకు షాక్?
ఫస్ట్ మూవీ ‘Devi’తోనే ఇంటిపేరుగా మారిన దేవిశ్రీ
‘పుష్ప 2: ది రూల్’ తర్వాత డబుల్ అయిన రెమ్యూనరేషన్?
అనిరుధ్‌తో పోలికలు.. ఎంత తీసుకుంటున్నారు అనిరుధ్ రవిచందర్?
‘ఉస్తాద్ భగత్ సింగ్’సహా చేతిలో ఉన్న ప్రాజెక్టులు
రెమ్యూనరేషన్ పెంపుతో కొత్త అవకాశాలు తగ్గాయా?
Devisri prasad | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్.. ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్ బస్టర్స్ అనిపించేలా అద్భుతమైన పాటలు అందించారు. ఆయన మ్యూజిక్ అందించిన సినిమాలు ప్లాప్ అయ్యాయేమో కానీ.. ఆయన మ్యూజిక్ మాత్రం ప్లాప్ అవ్వలేదు. మంచి పాటలు అందించాలి.. పది కాలాల పాటు గుర్తుండిపోవాలని ప్రాణం పెట్టేస్తాడు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు దేవిశ్రీ రెమ్యూనరేషన్ భారీగా పెంచేశాడని.. నిర్మాతలకు షాక్ ఇస్తున్నాడని.. వార్తలు వస్తున్నాయి. ఇంతకీ.. దేవిశ్రీ రెమ్యూనరేషన్ ఎంత..? ఎంత పెంచాడు..? ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టులు ఏంటి..?

Devisri prasad | ఫస్ట్ సినిమా టైటిలే ఇంటి పేరు..
దేవి సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. తన తొలి సినిమా టైటిల్ నే ఇంటి పేరుగా మారిపోయింది. అంతలా ఆ సినిమా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. దేవి సినిమాకి అద్భుతమైన సంగీతం అందించడంతో.. వరుసగా ఆఫర్స్ అందుకున్నాడు. ఇక అక్కడ నుంచి కెరీర్ లో వెనక్కి తిరిగి చూడలేదు. అనతి కాలంలోనే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. టాప్ స్టార్స్ అందరి సినిమాలకు అదిరిపోయే మ్యూజిక్ అందించి శభాష్ అనిపించుకున్నాడు.. ప్రేక్షకాభిమానుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. తనదంటూ ఓ మార్క్ క్రియేట్ చేశాడు.

Devisri prasad | రెమ్యూనరేషన్ డబుల్..
ఇక అసలు విషయానికి వస్తే.. పుష్ప 2 సినిమా ముందు వరకు 6 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునేవారట. అయితే.. లేటెస్ట్ గా తన రెమ్యూనరేషన్ ని రెట్టింపు చేశారని.. కొత్త సినిమాల కోసం 12 కోట్లు ప్లస్ జీఎస్టీ డిమాండ్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇంతలా ఒకేసారి రెమ్యూనరేషన్ డబుల్ చేయడంతో నిర్మాతలు షాక్ అవుతున్నారని ప్రచారం జరుగుతుంది. సౌతిండియాలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్న అనిరుథ్ ఒక్కో సినిమాకు 15కోట్లు తీసుకుంటున్నారట. అయితే.. అనిరుథ్ సినిమాల మ్యూజిక్ రైట్స్ ద్వారానే ఆ మొత్తం రికవరీ అవుతుండడంతో నిర్మాతలు అంత ఇవ్వడానికి ఏమాత్రం ఆలోచించడం లేదని టాక్.

Devisri prasad | కొత్త ప్రాజెక్టులు లేవా..?
అయితే.. రాక్ స్టార్ విషయంలో పరిస్థితి మరోలా ఉందని.. దీంతో ఆయన రెమ్యూనరేషన్ నిర్మాతలకు భారంగా మారుతుందని వార్తలు వస్తున్నాయి. అందుకనే.. వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ వైపు చూస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు దేవిశ్రీ చేతిలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఉంది. అలాగే చరణ్, సుకుమార్ సినిమాకి కూడా ఆయనే మ్యూజిక్ అందించనున్నారని తెలిసింది. అయితే.. రెమ్యూనరేషన్ భారీగా పెంచడం వలన కొత్త ప్రాజెక్టులు ఏమీ రాలేదట. మరి.. రెమ్యూనరేషన్ విషయంలో రాక్ స్టార్ తగ్గుతారో.. లేక తగ్గేదేలే అంటారో చూడాలి.
