విశ్వయోగి విశ్వంజీ ఆశీస్సులందుకున్న మండలి దంపతులు

విశ్వయోగి విశ్వంజీ ఆశీస్సులందుకున్న మండలి దంపతులు
అవనిగడ్డ – ఆంధ్రప్రభ : అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ దంపతులు విశ్వయోగి విశ్వంజీ ఆశీస్సులు అందుకున్నారు. సోమవారం గుంటూరు జిల్లా చినకొండ్రుపాడులో విశ్వనగర్లోని విశ్వగురు పీఠంలో ఆయనను మండలి బుద్ధప్రసాద్ – విజయలక్ష్మి దంపతులు దర్శించుకున్నారు. ఈ నెల 4-5 తేదీల్లో విశ్వంజీ పుట్టినరోజు సందర్భంగా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. విశ్వంజీ తమ పుట్టినరోజు వేడుకలను విశ్వశాంతి సమైక్యతా దినోత్సవ వేడుకలుగా నిర్వహించ తలపెట్టగా, 4వ తేదీ సాయంత్రం విశ్వగురు పీఠంలో జరిగే సభకు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ సభాద్యక్షుడిగా విచ్చేయనున్నారు.
