supreme leader | కౌన్సిల్‌ చేతికి పగ్గాలు

supreme leader | కౌన్సిల్‌ చేతికి పగ్గాలు

ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా అలిరెజా అరాఫీ
పరిపాలన కోసం ముగ్గురు సభ్యులతో ప్రత్యేక కౌన్సిల్ ఏర్పాటు

supreme leader | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఇరాన్ ప్రధాని ఖమేనీ మరణంతో ఖమేని వారసుడు అయతుల్లా అలిరెజా అరాఫీని ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా కౌన్సిల్‌ నియమించింది. చాలా ఏళ్ల తర్వత దేశ పాలనా వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కౌన్సిల్‌ను ఏర్పాటు అయ్యింది. ఇందులో అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, జ్యుడీషియరీ చీఫ్ గులాంహొస్సేన్ మొహసెని ఎజెయి, గార్డియన్ కౌన్సిల్ జ్యూరిస్ట్ ఉంటారని ఆ దేశ సంస్థ ఐఆర్‌ఎన్‌ఏ తెలిపింది.

ఇరాన్ రాజ్యాంగం ప్రకారం, 88 మంది సభ్యులున్న అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ తదుపరి పూర్తిస్థాయి సుప్రీం లీడర్‌ను ఎన్నుకునే వరకు ఈ కౌన్సిల్ బాధ్యతలు నిర్వహిస్తుంది. ఖమేనీ మృతి చెందినట్టు ఇరాన్‌ అధికార మీడియా ధ్రువీకరించింది. మరోవైపు ఐఆర్‌జీసీ కమాండర్‌ మహమూద్‌ పాక్‌పౌర్‌, ఖమేనీ కీలక సలహాదారుడు అలీ షామ్‌ఖానీ కూడా ఈ దాడుల్లో మృతి చెందినట్లు వెల్లడించింది.

Leave a Reply