సికింద్రాబాద్ : హైదరాబాద్ లోని సికింద్రాబాద్ లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మహంకాళి టెంపుల్ దగ్గర బైక్ పై వెళ్తున్న ఇద్దరిని కారు ఢీకొట్టడంతో వారు ఘటనా స్థలంలోనే మృతిచెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన వారిలో ఒకరిని బన్సీలాల్ పేటకు చెందిన ప్రణయ్ (18)గా గుర్తించారు.
కారు అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. బేగంపేటలోని పబ్లిక్ స్కూల్ ముందు రెండు బైకులు ఢీకొని ఒక మహిళ తీవ్రంగా గాయపడింది. అంబులెన్స్ లో ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.