ఘనంగా జాతర మహోత్సవం

ఘనంగా జాతర మహోత్సవం

భారీగా హాజరైన భక్తులు
శ్రీ కట్టమల్లన్న దేవాలయంలో పట్నాలు

కరీమాబాద్, ఆంధ్రప్రభ : నగరంలోని కీర్తి నగర్ గొర్రెకుంట గ్రామంలోని శ్రీ కట్ట మల్లన్న (మల్లికార్జున) స్వామి దేవస్థానంలో ఘనంగా జాతర మహోత్సవం ప్రారంభమైంది. జనవరి14 నుండి మార్చి 19 వరకు నిర్వహించడం జరుగుతుందని ఆలయ ఈవో నాగేశ్వరరావు తెలిపారు. ఆదివారం పట్నాలు మొక్కుబడులు కార్యక్రమం కొనసాగింది. పరకాల కోర్టు ఏజీపీ మేరుగుశ్రీనివాస్ శ్రీలత దంప తులు పట్నం సమర్పించారు. వారితోపాటువందలాది మంది భక్తులు హాజరై శ్రీ కట్ట మల్లన్న స్వామికి బోనం సమర్పించి పట్నాలు వేశారు. ఈనెల 15న పెద్దపట్నం శ్రీవారి కళ్యాణం నిర్వహించడం జరుగుతుందని ఈనెల 19 ఉగాదితో జాతర పూర్తి అవుతుందని దేవస్థానం అధికారులు పూజారులు తెలిపారు. కార్యక్రమంలో ఈవో నాగేశ్వరరావు క్లర్క్ ఆడెపు కృష్ణ, పూజారులు, ఒగ్గు పూజారులు, భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply