జాబ్ మేళా విజయవంతానికి అందరూ సహకరించాలి: సీఐ

ఉట్నూర్, ఆంధ్రప్రభ ; ఆదిలాబాద్ ఎస్పీ ఆదేశాల మేరకు మార్చి 10న నిర్వహించే జాబ్ మేళా విజయవంతానికి సర్పంచులు నాయకులు అందరూ సహకరించాలని నిరుద్యోగ యువతీ యువకులు ఈ మేళాలను సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని ఉట్నూరు సిఐ మడావి ప్రసాద్ అన్నారు. అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఆదివారం ఉట్నూర్ సర్పంచుల నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

చదువుకున్న నిరుద్యోగుల కోసం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని అన్నారు. పట్టణంతోపాటు గ్రామపంచాయతీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా సర్పంచులు నాయకులు కృషి చేయాలని రోడ్డు పక్కన ఉన్న పొదల తొలగింపులు తదితర విషయాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో ఉట్నూర్ ఎస్సై విజయ్, మండల సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.
