Rs.8,93,385 | నిరుపేదల ఆరోగ్యానికి కూటమి భరోసా..

Rs.8,93,385 | నిరుపేదల ఆరోగ్యానికి కూటమి భరోసా..

అన్ని విధాలుగా ఆదుకున్న సీఎంఆర్ఎఫ్..
ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు..
రూ.8.93 లక్షల సీఎంఆర్‌ఎఫ్ సహాయం..
11 గ్రామాల్లో 13 చెక్కులు పంపిణీ
లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి ఎమ్మెల్యే కొలికపూడి పరామర్శ..
గ్రామ సమస్యలపై తక్షణ పరిష్కార హామీ..

Rs.8,93,385 | గంపలగూడెం, ఆంధ్రప్రభ : నిరుపేదల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం పూర్తి భరోసాను కల్పిస్తుందని తిరువూరు శాసనసభ్యుడు కొలుకుపూడి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. గంపలగూడెం మండల పరిధిలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు విస్తృతంగా పర్యటించి లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) చెక్కులను పంపిణీ చేశారు. మండలంలోని 11 గ్రామాల్లో మొత్తం రూ.8,93,385 విలువైన 13 చెక్కులను అందజేశారు. కొణిజర్ల గ్రామంలో బొల్లా అనసూర్యమ్మకు రూ.1,40,000, సయ్యద్ హుస్సేన్ మీయాకు రూ.62,038 చెక్కులను అందజేశారు.

తునికపాడు గ్రామంలో రామిశెట్టి సత్యంబాబుకు రూ.44,231, సత్యాలపాడు గ్రామంలో వెన్నపూస కార్తీక మణికంఠకు రూ.56,783 విలువైన చెక్కులను వారి ఇళ్ల వద్దకే వెళ్లి అందజేశారు. లబ్ధిదారులను స్వయంగా పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, వైద్య ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న వారికి సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందించడం ప్రభుత్వ బాధ్యతగా పేర్కొన్నారు. సహాయం అందించినందుకు లబ్ధిదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

Rs.8,93,385 |

అనంతరం నెమలి గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అదే గ్రామంలో నూతనంగా మంజూరైన ఆరు స్పౌజ్ పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. సత్యాలపాడు గ్రామంలో పర్యటించిన సందర్భంగా గ్రామంలోని పెండింగ్ సీసీ రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిశీలించి త్వరలోనే పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక నాయకులు, కార్యకర్తలు, ఆలయ అధికారులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Rs.8,93,385 |
Rs.8,93,385 |

Leave a Reply