Collector | తాగునీరు కుళాయి లీకేజి
Collector | తాగునీరు కుళాయి లీకేజి
బాధ్యులపై చర్యలు తప్పవు..
ఖాళీ స్థలాల యజమానులకు నోటీసు జారీ చేయాలి
ఇంటింటి సర్వేలో కేసులు తగ్గుముఖం పట్టాయి
ఆసుపత్రులలో ప్రస్తుతం 96 కేసులు
జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
Collector | శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : పట్టణంలోని చేపల మార్కెట్ వద్ద తాగునీరు కుళాయి లీకేజిని కలెక్టర్ గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇందుకు సంబంధించిన బాధ్యులపై చర్యలు తీసుకోవడం తప్పదని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. పట్టణంలో ఉన్న ఖాళీ స్థలాల యజమానులకు నోటీసులు జారీ చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. విశాఖ బి, ఇందిరానగర్ కాలనీలలో శనివారం పారిశుద్ధ్యాన్ని, కాలువలు పరిశీలించారు. ఖాళీ స్థలాల్లో ఉన్న చెత్తను పరిశీలించారు. ఖాళీ స్థలాల్లో చెత్త వేయకుండా అక్కడ నిర్వాసితులకు నోటీసులు జారీ చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
చెత్తను తీసివేయాలని పారిశుధ్య సిబ్బందిని ఆదేశించారు. ఇంటింటికి వెళ్లి చెత్తను కలెక్షన్ చేసే మైక్రో పోకెట్స్ ఎన్ని ఉన్నాయని ఆయన అడిగి తెలుసుకున్నారు. ఖాళీ స్థలాల్లో చెత్త విపరీతంగా పేరుకుపోయిందని, దాని వలన దోమలు, తదితరమైనవి చేరుతాయని చెప్పారు. ఖాళీ స్థలాలను సందర్శించి అక్కడ చెత్త ఎక్కువగా ఉండటంతో భూ యజమానులకు జారీ చేసి స్థలం చుట్టూ గోడ నిర్మించి చుట్టు ప్రక్కల నివసించే నిర్వాసితులకు చెత్త వేయవద్దని చెప్పాంచాలన్నారు.

స్థల యజమాని నోటిసులకు స్పందించకపోతే కోర్టు ద్వారా నోటీసులు అందజేసినా స్పందించకపోతే మున్సిపల్ కార్పొరేషన్ చట్ట ప్రకారం చర్యలు ఉంటాయన్నారు. ఖాళీ స్థలాల భూ యజమానులు శుభ్రం చేయకపోతే మున్సిపల్ కార్పొరేషన్ కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ఇందిరానగర్ కాలనీలో రోడ్డు పైనే గుంతలు ఏర్పాటు చేసుకున్న ఆ గుంతలు ద్వారా లీకేజీలు వస్తున్న వాటిని పరిశీలించి గుంతలు క్లీనింగ్ చేస్తూ ఉండాలని ఆదేశించారు. కాలువలను పరిశీలించారు. కాలువలు లేని ప్రాంతంలో కాలువలు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు చెప్పారు.
డయేరియా పూర్తిగా తగ్గింది..
డయేరియా పూర్తి గా తగ్గిందని, రానున్న మరో రెండు రోజులు జాగ్రత్తగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ప్రజలను కోరారు. ఇంటింటి సర్వోలోను డయేరియా కేసులు కేసులు తగ్గాయన్నారు. ఆసుపత్రిలో ప్రస్తుతం 96 కేసులు ఉన్నాయని, ఈ కోలి బాక్టీరియా వలన కేసులు వచ్చినట్లు చెప్పారు. చేపల మార్కెట్ వద్ద లీకేజీ గుర్తించడమైనదని, తాగునీరు సరఫరాకు సంబంధించి ఇన్వెస్ట్ గేషన్ జరుగుతోందని, ఇన్వెస్టిగేషన్ పూర్తి అయితే బాధ్యులపై మరింత మంది పై చర్యలు తీసుకుంటామన్నారు.

ప్రజలంతా వేడిచేసిన నీటిని మాత్రమే త్రాగాలని కోరారు. ప్రజలంతా సహకరించాలన్నారు. 7 రోడ్లు కూడలి నుండి మెయిన్ రోడ్డు (జిటీ రోడ్డు) నుండి రైతు బజార్ కు వెళ్లే రహదారి కాలువలు, సూర్యమహల్ రోడ్డు వైపు వెళ్లే మెయిన్ రోడ్డు కాలువలను పరిశీలించి లీకేజీలు ఉన్న ఆయా షాపుల యజమానులతో మాట్లాడి లీకేజీలు నివారించాలని, లేదంటే నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు.
