సేవే లయన్స్ క్లబ్ ప్రదాన లక్ష్యం..

సేవే లయన్స్ క్లబ్ ప్రదాన లక్ష్యం..
- నిరుపేదలకు దుప్పట్లు, గొడుగులు పంపిణీ చేసిన లయన్స్ క్లబ్ సభ్యులు
హసన్ పర్తి. ఆంధ్రప్రభ : సమాజ అభివృద్ధికి సేవ చేయడమే లైన్స్ క్లబ్ ప్రధాన లక్ష్యమని జిల్లా లయన్స్ గవర్నర్ చంద్రశేఖర్ ఆర్య అన్నారు.లయన్స్ అంతర్జాతీయ ఫౌండేషన్ సహకారంతో.. లయన్స్ క్లబ్ ఆఫ్ హసన్ పర్తి అధ్యక్షులు శాంతికిరణ్ ఆధ్వర్యంలో నిరుపేదల అవసరార్థం దుప్పట్లు ,గొడుగుల పంపిణీ శారు.అనంతరం శాంతి కిరణ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన చంద్రశేఖర్ ఆర్య మాట్లాడుతూ లయన్స్ అంతర్జాతీయ సేవా సంస్థ అవసరార్థులను ఆదుకునే దిశగా లయన్స్ అంతర్జాతీయ ఫౌండేషన్ ద్వారా నిధులను జిల్లాకు మళ్ళించి కావలసిన మౌలిక సదుపాయాలు సమకూరుస్తున్నదని తెలిపారు, లయన్స్ అంతర్జాతీయ ఫౌండేషన్,ప్రపంచంలో ఏ ప్రాంతంలోనైనా ప్రకృతి వైపరీత్యాలు జరిగిన ప్రదేశంలో ముందుగా అక్కడ ఉన్న అవసరార్థులను గుర్తించి వారికి కావాల్సిన సదుపాయాలను కల్పించడంలో, వారిని ఆదుకోవడంలో ముందు వరుసలో ఉంటుందని పేర్కొన్నారు.
గత వర్షాకాలంలో వరంగల్ ,హనుమకొండ నగరాలలో వరద బీభత్సానికి ఎంతో మంది నిరాశయులయ్యారని, వారికి లయన్స్ అంతర్జాతీయ ఫౌండేషన్ ద్వారా దుప్పట్లను వంట సామాగ్రిని,బియ్యం,పప్పు, తదితర సదుపాయాలను కల్పించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 40 మంది అవసరార్థులకు దుప్పట్లను, గొడుగులను పంపిణీ చేశామని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రకాశం, క్లబ్ కార్యదర్శి శ్యాంసుందర్, క్లబ్ కోశాధికారి మోర రవి,పిఎస్ టి ఫోరం చైర్మన్ లయన్ డాక్టర్ అజిత్ కుమార్, నాగమళ్ళ సుధీర్, చెన్నూరు శ్రీనివాస్ ,గంగారపు రజినీకాంత్ ,కృపాకర్ ,కిరణ్ ,సంపత్ వెలగందుల భీష్మనాదం , శ్రీనివాస్, గోనెల రాజేందర్, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
