నన్ను చంపేందుకు ప్రయత్నం చేశారు

నన్ను చంపేందుకు ప్రయత్నం చేశారు

72 ఏళ్లలో 14 మంది ఎమ్మెల్యేలు అభివృద్ధిని పట్టించుకోలేదు
రెండేళ్లలో రూ1035 కోట్ల నిధులు తీసుకొచ్చా
నాలుగు గ్రామాలకు ఒక సబ్ స్టేషన్ మంజూరుచేస్తా
రైతులకులో వోల్టేజీ తీర్చి నాణ్యమైన విద్యుత్ అందజేస్తా
నా చివరి శ్వాస వరకు ప్రజాసేవ చేస్తా
అభివృద్ధిని అడ్డుకుంటే సహించే ప్రసక్తేలేదు
ప్రజలు పని చేసే నాయకులను గుర్తించాలి
బడుగులఅభివృద్ధికిప్రజాపాలన ప్రభుత్వంప్రత్యేక కృషి
ఉమ్మడి రాష్ట్రాల్లో మక్తల్ కు ఎంతో పేరు తీసుకొచ్చా
పశ్చిమగోదావరి తరహాలో మక్తల్ అభివృద్ధికికృషిచేస్తా
రాష్ట్ర పాడి పరిశ్రమల మత్స్య శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి

ఊట్కూర్, ఆంధ్రప్రభః గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రాంతం వెనుకబాటుకు గురైందని 72 ఏళ్లలో 14 మంది ఎమ్మెల్యేలు మక్తల్ నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదని కేవలం తన రెండేళ్లలో ఈ ప్రాంత అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో రూ.1035 కోట్ల నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తున్నానని రాష్ట్ర పాడి పరిశ్రమల మత్స్య క్రీడలు యువజన శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి స్పష్టంచేశారు. బడుగుల అభివృద్ధికి ప్రజా పాలన ప్రభుత్వం ప్రత్యేకకృషిచేస్తుందనిఅన్నారు.


శుక్రవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని పులిమామిడి లో రూ. 3.25 కోట్లతో 33/11 కె.వి సబ్ స్టేషన్ కు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు విద్యుత్ కష్టాలు తీర్చాలంటే నాలుగు గ్రామాలకు విద్యుత్ సబ్స్టేషన్ మంజూరు చేస్తానని వెల్లడించారు. ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కావడంతో ఈ ప్రాంతంలో అభివృద్ధి పనులు చేపట్టకుండా కొందరు పనులను అడ్డుకుంటున్నారని ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు.

ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మక్తల్ నియోజకవర్గం పేరు మార్మోగుడుతుండడంతో కొందరు నన్ను చంపేందుకు ప్రయత్నించారని భావోద్వేగానికి గురయ్యారు. జీవిత కాలంలో ఎవరికి చేయిచాచి బ్రతిమాల లేదని అందుకే నేను ప్రజల అండతో మొదటిసారి గెలిచి మంత్రి అయ్యానని గుర్తు చేశారు. అభివృద్ధి పనులు చేస్తే ప్రతిపక్ష నాయకులు పనులు జరగకుండా అడ్డుకోవడం సరైంది కాదని ప్రజలు గమనిస్తున్నారని మక్తల్ మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ అభ్యర్థి చనిపోతే ఢిల్లీ వరకు నన్ను బద్నాం చేసే విధంగా చూస్తే ప్రజలు నాకు అండగా నిలిచారని ప్రతిపక్ష నాయకులకు చెంపపెట్టుగా మారిందన్నారు.

గత పాలకులు నియోజకవర్గ అభివృద్ధి పట్టించుకోకపోవడం వల్ల అభివృద్ధి కుంటూ పడిందని ఈ ప్రాంతంలో నెలకొన్న సమస్యలపై పట్టు ఉందని మూడేళ్ల కాలంలో వాటిని పరిష్కరించి ప్రజల రుణం తీర్చుకుంటానని అన్నారు. మక్తల్- నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకంతో ఈ ప్రాంత రూపురేఖలు మారి బీడు భూములు సస్యశ్యామలంగా మారుతాయని పశ్చిమగోదావరి జిల్లా తరహాలో మక్తల్ నియోజకవర్గం అన్నపూర్ణగా తీర్చిదిద్దుతానని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని ఒప్పించి భూ నిర్వాసితులకు ఎకరాకు రూ. 20 లక్షల చొప్పున పరిహారం మంజూరు చేయించానని అన్నారు. ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందజేస్తుందని పొదుపుగా వాడుకోవాలనిసూచించారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో మూడేళ్ల కాలంలో మంత్రిగా ఉండి ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని స్పష్టంచేశారు.

ప్రతిపక్ష నాయకులు చేసే కుట్రలకు భయపడేవాడిని కాదని నాయకులకు కార్యకర్తలకు 24 గంటలు అందుబాటులో ఉంటానని అధైర్యపడవద్దని భరోసానిచ్చారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలు చేస్తానన్నారు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలని చదువు సంస్కారం ఇస్తుందని అన్నారు. విద్యుత్ సబ్స్ స్టేషన్ పనులు త్వరగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. పులిమామిడి మాజీ సర్పంచ్ లను ప్రతిపక్ష నాయకులు ఎన్నో రకాలుగా వేధిస్తున్నారని వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.గ్రామంలో నెలకొన్న వివిధ సమస్యలపై మంత్రికి వివరించారు.


ఈ కార్యక్రమంలో సర్పంచ్ త్రివేణి, తాహసిల్దార్ చింతా రవి, విద్యుత్ శాఖ ఎస్ఈ నవీన్ కుమార్, డి ఈ నర్సింగ్ రావు, ఈ ఈ ప్రవీణ్ కుమార్, ఎంపీడీవో కిషోర్ కుమార్, విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాస్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు డి యగ్నేశ్వర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి సూర్యప్రకాశ్ రెడ్డి, మాజీ సర్పంచులు పెద్ద సూరయ్య గౌడ్, చిన్న సూరయ్య గౌడ్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు కోరం మహేష్ రెడ్డి, ఆర్ ఐ వెంకటేష్, పంచాయతీ కార్యదర్శి రవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply