గుడి నిర్మాణానికి విరాళం అందజేత

గుడి నిర్మాణానికి విరాళం అందజేత

  • రూ.20016 చెకిచ్చిన చైర్మన్

జన్నారం రూరల్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని మందపల్లి గ్రామంలో నిర్మించనున్న అగ్నిమల్లన్న స్వామి గుడి నిర్మాణం కొరకు మండల కేంద్రంలోని రాఘవేంద్ర విద్యాసంస్థల చైర్మన్,మాజీ జడ్పీటీసీ సభ్యుడు ఎర్ర చంద్రశేఖర్ రూ.20016 లను విరాళంగా అందజేశారు.మండల కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం గుడి నిర్మాణ కమిటి నేతలకు ఆయన చెక్కును ఇచ్చారు.ఈ సందర్భంగా ఆయనకు కమిటి నేతలు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply