డిగ్రీ ఫలితాలలో సత్తా చాటిన విద్యార్థులు వీరే…

చిట్యాల, ఆంధ్రప్రభ : ఇటీవల ప్రకటించిన కాకతీయ యూనివర్సిటీ, యూజీ ఫలితాలలో చిట్యాల మండల కేంద్రంలోని సువిద్యా డిగ్రీ కళాశాల విద్యార్థిని, విద్యార్థులు, జిల్లాలోని మొదటి స్థానంలో నిలిచారని కళాశాల కరస్పాండెంట్ కందికొండ రాజు శుక్రవారం తెలిపారు. బీజెడ్ సీ ఫస్ట్ ఇయర్ లో కందికొండ సిరిచందన, 8.37 .జీపీతో జిల్లాలోనే మొదటి స్థానంలో నిలువగా.. బీకాం కంప్యూటర్ లో బెజ్జంకి శ్రీజ 7.67 జీపీ, బెజ్జంకి శ్రావణి 6.76 జీపీ చెక్క మానస 6.17 జీపీ ఉద్దమారి సంగీత 6.74 జీపీతో నిలిచాన్నారు.

అలాగే బీకాం ఫస్ట్ ఇయర్ లో బోండ్ల సౌమ్య 7.12 జీపీ గుజ్జుల వరుణ్ కుమార్ 7.08 జీపీ, బీజెడ్ సీలో మంద సాయిశ్రీ 7.07 జీపీతో జిల్లాలోని మొదటి స్థానం నిలిచారని తెలిపారు. మారుమూల ప్రాంతమైన చిట్యాల మండల కేంద్రంలోని సువిద్య డిగ్రీ కళాశాల విద్యార్థిని విద్యార్థులు ఈ ఫలితాలు సాధించడానికి కృషి చేసిన కళాశాల అధ్యాపక బృందానికి, విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్ కందికొండ రాజు అభినందించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు నోముల వేణు, లోకేందర్ రెడ్డి, తిరుపతి,యుగంధర్,మమత నాగరాణి, ప్రశాంత్,సురేందర్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply