Hero Nani | వైరలైన నాని స్టెప్..

Hero Nani | వైరలైన నాని స్టెప్..

Hero Nani | ‘దసరా’ తర్వాత నాని–శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబో
‘ఆయా షేర్’ సాంగ్‌తో వైరల్ అయిన హుక్ స్టెప్
“ఆ స్టెప్ నాదే” అంటూ బాబా జాక్సన్ ఆరోపణ
నెటిజన్ల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్
మేకర్స్ స్పందన కోసం ఎదురుచూపులు
ఆగస్టు 21కి వాయిదా పడిన ‘ప్యారడైజ్’ రిలీజ్

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ప్యారడైజ్. ఈ మూవీకి డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. నాని, శ్రీకాంత్ ఓదెల.. ఈ ఇద్దరి కాంబినేషన్లో దసరా సినిమా రూపొందడం.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో.. ప్యారడైజ్ మూవీ పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అయితే.. ఈ మూవీ నుంచి సాంగ్ రిలీజ్ చేస్తే.. అందులో నాని స్టెప్ వైరల్ అయ్యింది. ఈ సాంగ్ ట్రెండ్ అవుతున్న టైమ్ లో.. నాని స్టెప్ కాపీ అంటూ ఆరోపణలు వచ్చాయి. ఇది హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ.. నాని హుప్ స్టెప్ నిజంగానే కాపీనా..?

Hero Nani | ఆ స్టెప్ నాదే..

Hero Nani

ప్యారడైజ్ మూవీ నుంచి ఆయా షేర్ అనే మాస్ బీట్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటలో మ్యూజిక్ ముఖ్యంగా నాని ఎనర్జిటిక్ హుక్ స్టెప్ విశేషంగా ఆకట్టుకుంది. ఇంత వరకు అంతగా డ్యాన్స్ చేయని నాని ఈ రేంజ్ లో డ్యాన్స్ చేయడంతో అంతా ఫిదా అయిపోయారు. అయితే.. ఈ హుక్ స్టెప్ వివాదస్పదం అయ్యింది. బాబా జాక్సన్ అనే డ్యానర్స్, సోషల్ మీడియా ఇన్ప్లూయెన్సర్.. నాని వేసిన హుక్ స్టెప్ తనదేనని ఆరోపిస్తున్నారు. ఆయనకు ఇన్ స్టాగ్రామ్ లో దాదాపు రెండు మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. సోషల్ మీడియాలో తాను గతంలో వేసిన డ్యాన్స్ వీడియోను షేర్ చేశారు.

Hero Nani | ఏది ఓరిజినల్.. ఏది కాపీ..

Hero Nani

తన స్టెప్ నే ప్యారడైజ్ మూవీలో మేకర్స్ కాపీ చేశారని అంటున్నాడు. అయితే.. నాని వేసిన స్టెప్, బాబా జాక్సన్ వేసిన స్టెప్ చూపిస్తూ.. ఇది ఓరిజనల్, ఇది కాపీ అంటూ పోస్ట్ చేయడంతో ఈ డ్యాన్స్ వీడియో ఒక్కసారిగా వైరల్ అయ్యింది. అయితే… ఈ డ్యాన్సర్ ఆరోపణల పై నెటిజన్ల నుంచి మిక్సిడ్ రెస్పాన్స్ వస్తుంది. కొందరు నిజంగానే ఇది కాపీ అంటుంటే.. మరి కొందరూ ఇలాంటి స్టెప్పులు మామూలే అని.. దీనిని కాపీ అనడం కరెక్ట్ కాదంటున్నారు. ఇలాంటి స్టెప్స్ గతంలో స్టార్ హీరోలు వేసారంటున్నారు. ఏది ఏమైనా నాని హుక్ స్టెప్ వైరల్ అయ్యింది.

Hero Nani | ఆయా షేర్.. చార్ట్ బస్టర్..

Hero Nani

ఈ ఆయా షేర్ సాంగ్ కు కొరియోగ్రఫీ అందించింది సుధన్ మాస్టర్. ఈ డ్యాన్స్ కాపీ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మేకర్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఈ సాంగ్ రిలీజై గంటల్లోనే చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఈ వివాదం పై ఎలా రియాక్ట్ అవుతారో అనేది ఆసక్తిగా మారింది. ఈ క్రేజీ మూవీ మార్చి 26న రిలీజ్ కావాలి కానీ.. ఆగష్టు 21కి వాయిదాపడింది. ఇందులో విలక్షణ నటుడు మోహన్ బాబు విలన్ గా నటిస్తుండడంతో.. అంచనాలు భారీగా ఉన్నాయి. మరి.. ప్యారడైజ్ థియేటర్స్ లో ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Leave a Reply