డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్

డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్

హెల్మెట్ లేని వారి నుండి 11, 320 అపరాధ రుసుం వసూలు

చిట్టినగర్, ఆంధ్రప్రభ : విజయవాడ నగర పోలీసు కమిషనర్ ఎస్ రాజశేఖర్ బాబు ఆదేశాలతో టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చిట్టి నగర్ సెంటర్ లో మంగళవారం రాత్రి 9 గం నుండి 11 గం వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్ లో భాగంగా, మద్యం సేవించి మోటార్ సైకిల్ నడుపుతున్న 11 ద్విచక్ర వాహనదారులను అదుపులోకి తీసుకుని, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు వారిపై నమోదు చేసి 11 వాహనాలను సీజ్ చేశారు.

అదే విధంగా హెల్మెట్ డ్రైవ్ సాయంత్రం 5 – 7 గంటల మధ్య నిర్వహించారు. ఈ హెల్మెట్ డ్రైవ్ లో 52 ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ లేని కారణంగా అపరాధ రుసుం 11,320 రూపాయలు ఈ- చలానా ద్వారా విధించారు. అలాగే జనవరి 2026 నెల నుండి ఇప్పటివరకు మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 100 వాహనాలను సీజ్ చేశారు. ఆ వాహనదారుల పై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. ఈ 100 వాహనాల్లో 70 వాహనదారులకు 1st క్లాస్ స్పెషల్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు లో హాజరు పరచగా, వారికి జడ్జి ఒక్కొక్కరికి 10,000/- రూపాయలు ఫైన్ విధించారు.

మద్యం తాగి వాహనాలు నడిపి వారు ప్రమాదాల బారిన పడటమే కాక, . ఎదుటి వారికి కూడా ప్రమాదం వాటిల్లుతుందని తెలుసుకోవాలి. హెల్మెట్ డ్రైవ్ అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రతి రోజూ జరుగుతుంది. కావున ప్రజలు అందరూ హెల్మెట్ ధరించి సురక్షితంగా గమ్యస్థానాల కు చేరాలని పోలీసులు తెలిపారు. అలాగే తాగి ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు నడపవద్దు అని టూ టౌన్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్ చిన్న కొండలరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం పశ్చిమ ఏ.డి.సి.పి, ఏ.సి.పి దుర్గారావు పర్యవేక్షణలో టూ టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ లు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

Leave a Reply