25thFebCartoon| ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా

25thFebCartoon| ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరామూడుకాలాల వాతావరణ అయోమయం

25thFebCartoon| ఎండాకాలంలో వానలు – వాతావరణం చేసే వింతలు
మూడు కాలాలు ఒకేసారి? ప్రజలకు కొత్త అనుభవం
గొడుగో? స్వెట్టరో? ఎండకి టోపీయో? అయోమయంలో జనాలు
వాతావరణ అసమతుల్యతపై వ్యంగ్య చిత్రణ
టైమ్‌లీ ‘ఔరా’

కాలం మారిందంటే ఏమో అనుకుంటాం కానీ ఒక్కోసారి నిజమేననిపిస్తుంది. ఎండాకాలంలో వానలు, వానాకాలంలో చురుక్కుమనిపించే ఎండలు…ఈ రెండుకాలాల్లోనూ వణికించే చలిని తెచ్చే చల్లటి గాలులు…అబ్బో..కాలం చేసే వింతలు ఇన్నీ అన్నీ కావండోయ్…కానీ అవన్నీ ఒకేత్తు…ఈమధ్య జనానికి మరో కొత్త అనుభవం ఎదురవుతోంది..అదేమిటో తెలుసా? మూడు కాలాలూ కలిసి వచ్చి జనాన్ని పలకరించేస్తున్నాయి.

అదెలాగంటారా? ఒక్కసారి ఈ కార్టూన్ చూడండి..మీకే తెలుస్తుంది.

25thFebCartoon
25thFebCartoon

వాతవరణ ప్రకటన చేసేవారికే అయోమయంగా మారిన మూడుకాలాల వాతావరణం, అసలు బయటకు వెళ్ళేవారికి వానకి గొడుగు వేసుకెళ్ళాలో, చలికి స్వెట్టర్ వేసుకెళ్ళాలో, చురుక్కుమనే ఎండకి గొడుకేసుకెళ్ళాలో తెలియని పరిస్థితి ఎదురవుతోంది…

దీనికి అనేక భూవాతావరణ పరిస్థితులున్నాయనుకోండి, అది వేరే విషయం. ఈ వాతావరణ అసమతుల్యతను ఎలా అర్థం చేసుకోవాలంటారు? ఈ అయోమయాన్ని చక్కగా చిత్రించిన ఆంధ్రప్రభ కార్టూన్ ఇది. టైం లీ కార్టూన్ ఇది. గత ఇరవై ఏళ్ళుగా ఆంధ్రప్రభ పాఠకులను, కార్టూన్ ఇష్టులను అలరిస్తోన్న కార్టూన్ ఫీచర్ ఔరా.

-ఆంధ్రప్రభ వెబ్ డెస్క్

Leave a Reply