ఆటో పల్టీ – పలువురికి గాయాలు

ఆటో పల్టీ – పలువురికి గాయాలు
నాగాయలంక – ఆంధ్రప్రభ : అవనిగడ్డ – నాగాయలంక ప్రధాన రహదారిపై వక్కపట్ల వారి పాలెం ఐస్ ఫ్యాక్టరీ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బాపట్ల జిల్లా అల్లపరు గ్రామం నుండి కృష్ణాజిల్లా నాగాయలంక మండలం పరచివర గ్రామంలో ఓ కార్యక్రమానికి వెళుతూ ఉన్న 10 మందితో ప్రయాణిస్తున్న ఆటో వక్కపట్లవారిపాలెం ఐస్ ఫ్యాక్టరీ వద్దకు రాగానే ఒక్కసారిగా పల్టీ కొట్టింది.
ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురుకు స్వల్ప గాయాలు కాగా, ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో 108లో అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నాగాయలంక ఎస్సై రాజేష్ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.
