విజయలక్ష్మి భౌతిక కాయానికి నివాళులు

విజయలక్ష్మి భౌతిక కాయానికి నివాళులు

గుడివాడ – ఆంధ్రప్రభ : కృష్ణాజిల్లా ఆదిమాంద్ర సంఘం అధ్యక్షులు దళిత సంఘాల ఐక్య వేదిక నాయకులు పొంగులేటి జయరాజు సతీమణి విజయలక్ష్మి స్వర్గస్తులయ్యారు. నాగవరప్పాడులోనీ హోసన్నా మినిస్ట్రీస్ వద్ద ఉంచిన జయలక్ష్మి భౌతికకాయానికి గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మరియు కూటమి నాయకులు పూలమాలతో నివాళులు అర్పించి, ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం విజయలక్ష్మి భర్త జయరాజు మరియు కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే రాము పరామర్శించి మనోధైర్యం చెప్పారు.

విజయలక్ష్మి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము ప్రార్థించారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవి,మండల టిడిపి అధ్యక్షుడు వాసే మురళి, టిడిపి నాయకులు గుత్తా చంటి, పండ్రాజు సాంబయ్య, సింగాల రాధాకృష్ణ, వేశపోగు ఇమ్మానుయేలు, మెరుగు మోజెస్, డేవిడ్, కనకాంబరం, వసంతవాడ దుర్గారావు, అందుగుల ఏసు పాదం, పలువురు నాయకులు ఎమ్మెల్యే వెంట పాల్గొని స్వర్గీయ విజయలక్ష్మి భౌతిక కాయానికి నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు.

Leave a Reply