నేటి నుంచి ఇంటర్మిడియేట్ పరీక్షలు షురూ

చెన్నూర్, ఆంధ్రప్రభ : బోర్డ్ అఫ్ ఇంటర్మిడియేట్ ఇవ్వటినుంచి మొదలైయ్యాయి. నేటి నుంచి మొదలైన ప్రథమ ద్వితీయ సంవత్సరాల విద్యార్థుల కు మార్చ్ 14వరకు పరీక్షల నిర్వహణ జరుగనుంది. చెన్నూరు లో రెండు సెంటర్లలో 533 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందుకు గాను అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్ష కేంద్రాల 144 సెక్షన్ అమలులో ఉన్నందున్న పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల లోపు ప్రజలు ఒక చోట గుమికూడదని సీఐ బన్సీలాల్ పేర్కొన్నారు.సమీప జిరాక్స్ సెంటర్లను కూడా ముసివేశారు.పరీక్ష కేంద్రాలలో ఎలాంటి మాస్ కాపీయింగ్ జరగకుండా స్పెషల్ తనిఖీ బృందాలు, బయిటినుంచి ఎలాంటి కాపీయింగ్ కు అవకాశలు లేకుండా పోలీస్ బందోబస్తూ ఏర్పాటు చేశారు.

Leave a Reply