NTR -AKHIL | ఈ క్రేజీ కాంబో నిజమేనా..?

NTR -AKHIL | ఈ క్రేజీ కాంబో నిజమేనా..?

NTR -AKHIL | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబోపై భారీ అంచనాలు
జోర్డాన్ షెడ్యూల్ తర్వాత ఆసక్తికరమైన టాక్
ప్రశాంత్ నీల్ ఈసారి కలర్ ఫుల్ ప్రెజెంటేషన్?
ఎన్టీఆర్ సినిమాలో అఖిల్ నటిస్తున్నాడా?
ప్రశాంత్ నీల్ – అఖిల్ ప్రాజెక్ట్‌పై స్పష్టత ఏమిటి?
సలార్ 2, కేజీఎఫ్ 3 మధ్య అఖిల్ ఛాన్స్?

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ఈ ఇద్దరి క్రేజీ కాంబోలో భారీ పాన్ ఇండియా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. ఇటీవల జోర్డాన్ లో షూటింగ్ జరుపుకుంది. ఇదిలా ఉంటే.. ఈ క్రేజీ మూవీలో అక్కినేని అఖిల్ నటిస్తున్నాడని ఓ వార్త చక్కర్లు కొడుతుంది. దీంతో.. ఇది నిజమా..? కాదా..? అనేది ఆసక్తిగా మారింది. అసలు ఏం జరుగుతోంది..?

NTR -AKHIL

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందుతోన్న ఈ సినిమా పై ఆకాశమే హద్దు అనేలా అంచనాలు ఉన్నాయి. పైగా వార్ 2 సినిమా ప్లాప్ అవ్వడంతో.. ఈసారి ఖచ్చితంగా ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ సాధించాల్సిన పరిస్థితి. అందుకనే ప్రశాంత్ నీల్ కథ పై మరింతగా కసరత్తు చేసి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే.. నీల్.. సినిమాలు ఎలా ఉంటాయో తెలిసిందే. ఆయన సినిమాల్లో తెర పై బ్లాక్ కలర్ ఎక్కువుగా కనిపిస్తుంటుంది. ఈసారి రూటు మార్చి కలర్ ఫుల్ గా ఉండేలా డిజైన్ చేసారనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్.

NTR -AKHIL

వీటన్నింటి కంటే.. ఈ సినిమాలో అక్కినేని అఖిల్ నటిస్తున్నాడనే వార్త ఇంట్రెస్టింగ్ గా మారింది. ఎన్టీఆర్ తో అఖిల్ కి మంచి అనుబంధం ఉంది. అలాగే ప్రశాంత్ నీల్ తో కూడా అఖిల్ కి మంచి అనుబందం ఉంది. ఆ కారణంగానే.. ఈ సినిమాలో ఉన్న యంగ్ హీరో క్యారెక్టర్ లో నటించేందుకు అఖిల్ ఓకే చెప్పాడని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరో వైపు ప్రశాంత్ నీల్ తో అఖిల్ సినిమా అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. దీంతో ఏది నిజం.. ఎన్టీఆర్ మూవీలో అఖిల్ నటించడమా..? ప్రశాంత్ నీల్ తో అఖిల్ సినిమా చేయడమా..? అనేది హాట్ టాపిక్ అయ్యింది. అయితే.. ప్రశాంత్ నీల్ ఇప్పుడు సలార్ 2 చేయాలి, కేజీఎఫ్ 3 చేయాలి. అందుచేత అఖిల్ తో ప్రశాంత్ నీల్ మూవీ కాదు.. ఎన్టీఆర్ సినిమాలోనే అఖిల్ నటించే ఛాన్స్ ఉంది అంటున్నారు సన్నిహిత వర్గాలు. మరి చూడాలి.. ఇది నిజం అవుతుందో గాసిప్ గా మిగిలిపోతుందో…?

NTR -AKHIL

Leave a Reply