20 years | గొడవలే కారణమా…

20 years | గొడవలే కారణమా…
20 years | హసన్ పర్తి, ఆంధ్రప్రభ : హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం సిద్దాపూర్ లో వృద్ధుడైన బాల్నె మొగిలి(70)ని దారుణంగా హత్య చేసిన ఉదంతం ఇది. మంగళవారం తెల్లవారుజామున స్వంత ఇంట్లోనే హత్య జరగడంతో సర్వత్రా చర్చనీయాంశంగామారింది. మొగిలిని ఇటుకలు, రాళ్ళు, కర్రలతో కొట్టడంతో చనిపోయినట్టు సమాచారం. ఈ దుర్ఘటనకు స్వంత మరదలు ఇందిరే కారణమని కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈసమాచారం మేరకు పోలీసులు హత్య జరిగిన ప్రదేశానికి చేరుకొని విచారణను ప్రారంభించారు. స్థానిక సీఐ కథనం వివరాలిలా ఉన్నాయి. సిద్ధాపూర్ గ్రామానికి చెందిన మొగిలి ఒక కొడుకు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గత 20 సంవత్సరాలుగా మొగిలి అమృత హస్పిటల్ సెక్యూరిటీ గార్డుగా పని చేస్తూ బార్య సరోజనతో హన్మకొండలో జీవనం సాగిస్తున్నారు. తన బార్య చెల్లెలు వంగ ఇందిరకు ఎవ్వరూ లేకపోవడంతో సిద్దాపూర్ లోని వారి స్వంత ఇంట్లో ఉంటూ జీవనాన్ని కొనసాగుస్తున్నది.
గత మూడు నెలల క్రితం మొగిలి భార్య సరోజన చనిపోయింది. దీంతో మొగిలి స్వంత గ్రామమైన సిద్ధాపూర్ కు వచ్చి తన సొంత ఇంట్లో ఉంటున్నాడు. అప్పటికే అదే ఇంట్లో ఉంటున్న మరదలు ఇందిరతో మొగిలికి తరుచుగా గొడవలు జరుగుతున్నట్టు సమాచారం. ఈ గొడవలే హత్యకు దారి తీసినట్టు కుటుంబ సభ్యులు వాపోతున్నారు. మృతుని కుమారుడు రాజ్ కుమార్ తన తండ్రి హత్యకు తమ చిన్నమ్మ ఇందిరే కారణమని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈమేరకు మృత దేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించి, ఇందిరపై కేసు నమోదు నమోదు చేసి విచారణను కొనసాగిస్తున్నట్లు సిఐ చేరాలు తెలిపారు.
