అభివృద్ధికి సహకరించాలి

అభివృద్ధికి సహకరించాలి
- పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని, ఝాన్సీ రెడ్డి
తొర్రూరు, ఆంధ్రప్రభ : పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాల సహకారం అందించాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు.పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతూ మంగళవారం హైదరాబాదులో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టిపిసిసి ఝాన్సీ రెడ్డిలు మర్యాదపూర్వకంగా కలిసి విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలోని పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి నిధులు కేటాయించాలని, తొర్రురు మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు కేటాయించాలని సీఎంను కోరారు.
తొర్రూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ చైర్మన్, వైస్ చైర్మన్ గెలుచుకోవడం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు.తొర్రురు పట్టణంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి టీ యూ ఎఫ్ ఐ డీ సీ నిధులు కేటాయించాలని అభ్యర్థించారు. పట్టణంలో రోడ్ల విస్తరణ, డ్రైనేజ్ వ్యవస్థ అభివృద్ధి, వీధిదీపాలు, పార్కులు, నీటి సరఫరా మరియు ఇతర మౌలిక అవసరాల కోసం ఈ నిధులు అత్యవసరమని వివరించారు.ఎమ్మెల్యే అభ్యర్థనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు.
పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరించనున్నట్లు హామీనిచ్చారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ…తొర్రూరు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేసిందన్నారు. ప్రజల నుంచి వస్తున్న అనూహ స్పందనను చూసి ప్రతిపక్షాల కండ్లు మండుతున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకున్నా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని సమర్థవంతంగా అభివృద్ధి చేస్తున్నాడని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను చూసి పాలకుర్తి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ అండగా నిలుస్తున్నారని తెలిపారు.
