Boyapati Srinu | యంగ్ హీరోతో సెట్ అయ్యిందా..?

Boyapati Srinu | యంగ్ హీరోతో సెట్ అయ్యిందా..?
Boyapati Srinu | యంగ్ హీరోతో సెట్ అయ్యిందా..?
Boyapati Srinu | అఖండ 2 తర్వాత బోయపాటి నెక్ట్స్ ఎవరిది?
రణ్‌వీర్ సింగ్‌తో సినిమా గాసిప్పేనా?
బన్నీకి కథ చెప్పిన బోయపాటి
కిరీటి రెడ్డితో మాస్ కాంబో సెట్ అవుతుందా?
భారీ ఆఫర్స్ మధ్య బోయపాటి నిర్ణయం ఎప్పుడు?
నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై ఉత్కంఠ
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఊర మాస్ డైరెక్టర్ అంటే ఠక్కుడ మైండ్ లోకి వచ్చేది బోయపాటి శ్రీను. ఆయన ఇటీవల అఖండ 2 అంటూ భారీ సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీ ఆశించిన స్థాయిలో అంచనాలు అందుకోలేకపోయింది. ఈ మూవీ తర్వాత ఇంత వరకు బోయపాటి నెక్ట్స్ మూవీ ఎవరితో అనేది అనౌన్స్ చేయలేదు. బాలీవుడ్ హీరోతో బోయపాటి మూవీ అంటూ ప్రచారం జరిగింది. ఇప్పుడు యంగ్ హీరో పేరు గట్టిగా వినిపిస్తోంది. మరి.. యంగ్ హీరోతో బోయపాటి మూవీ ఫిక్స్ అయ్యిందా..? ఇంతకీ.. ప్రచారంలో ఉన్న ఆ యంగ్ హీరో ఎవరు…?
Boyapati Srinu | రణ్ వీర్ – బోయపాటి..

అఖండ 2.. అనుకున్న టైమ్ కి రిలీజై.. బ్లాక్ బస్టర్ సాధించి ఉంటే.. బోయపాటి నెక్ట్స్ మూవీకి ఇంత టైమ్ పట్టేది కాదు. అయితే.. ఆశించిన స్థాయిలో అఖండ 2 కమర్షియల్ గా వర్కవుట్ కాకపోవడంతో.. బోయపాటి నెక్ట్స్ మూవీ ఇంత వరకు సెట్ కాలేదు. ఆమధ్య బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ తో బాలయ్య సినిమా అంటూ ప్రచారం జరిగింది. ఇద్దరి మధ్య కథాచర్చలు జరిగినట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే.. ఇంత వరకు దీనికి సంబంధించిన అప్ డేట్ లేదు. బోయపాటి చెప్పిన కథ నచ్చిందా..? నచ్చలేదా..? అనేది క్లారిటీ లేదు కానీ.. ప్రస్తుతానికి అయితే ఈ కాంబో మూవీ లేదు.
Boyapati Srinu | కిరిటి, బోయపాటి..

ఇటీవల బోయపాటి ముంబాయి వెళ్లి బన్నీకి కథ చెప్పడం జరిగింది. ఆ కథ బన్నీకి బాగా నచ్చడం కూడా జరిగింది. అయితే.. బన్నీ వరుస సినిమాలతో బిజీగా ఉండడం వలన ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి రావాలంటే.. చాలా టైమ్ పడుతుంది. ఇక అసలు విషయానికి వస్తే.. ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరీటి రెడ్డి ఇటీవల హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆయన నటించిన తొలి చిత్రం జూనియర్. ఈ సినిమా ఈమధ్య కాలంలో విడుదలై ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు తన రెండో సినిమాను మాస్ డైరెక్టర్ తో.. భారీ సినిమాగా చేయాలి అనుకుంటున్నాడట.
Boyapati Srinu | బాలీవుడ్ నుంచి భారీ ఆఫర్స్..

ఈ నేపథ్యంలో మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన దర్శకుడు బోయపాటి శ్రీనును ఇటీవల కిరీటి కలిసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తనతో ఓ మాస్ ఎంటర్టైనర్ చేయాలని కోరినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రొడక్షన్ బాధ్యతలన్నీ తమవేనని, అడ్వాన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. అలాగే పలువురు నిర్మాతలు బోయపాటితో సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని.. బాలీవుడ్ నుంచి కూడా భారీగా ఆఫర్స్ వస్తున్నాయట. అందుచేత బోయపాటి.. నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయమై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట. మరి.. కిరిటీ, బోయపాటి కాంబో సెట్ అవుతుందో లేదో చూడాలి.
