డిమాండ్లు పరిష్కరించే వరకు పోరాడుతాం

డిమాండ్లు పరిష్కరించే వరకు పోరాడుతాం

  • 9వ రోజుకు చేరిన సహకార సంఘ ఉద్యోగుల సమ్మె

చల్లపల్లి – ఆంధ్రప్రభ : తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు పోరాటం ఆగదని సహకార సంఘాల ఉద్యోగులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా నాయకులు చండ్ర రవి కుమార్, తోట కృష్ణారావు, కోసూరు రామాంజనేయులు పేర్కొన్నారు. నియోజక వర్గ స్థాయిలో ఉన్న 37 సొసైటీల సిబ్బంది మంగళవారం స్థానిక కేడీసీసీ బ్యాంకు ఆవరణలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… జి ఓ నెం. 36 ను వెంటనే అమలుపరిచి డి.ఎల్.ఎస్.ఎఫ్. ఏర్పాటుతో జీతభత్యాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఉద్యోగులకు ప్రతి 5 సంవత్సరాలకు వేతన సవరణ చేయవలసి ఉండగా ఇప్పటి వరకు జరగలేదని 2019, 2024 తాలుకు పెండింగ్ లో వున్న వేతన సవరణలు చేయాలని, అప్పటివరకు మధ్యంతర భృతి ఇవ్వాలన్నారు. గ్రాట్యుటీ చట్టాన్ని అమలుపరిచి చట్ట ప్రకారం గ్రాట్యుటీ చెల్లింపులు చేయాలని కోరారు. సహకార సంఘాలలో పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులకు అమలు అయ్యే రిటైర్మెంట్ వయస్సు అమలు పరుచుకోవచ్చని చట్టం లో వున్నందున, జి. ఓ నెం. 36 లోను ప్రభుత్వం అనుమతించినందున సహకార సంఘాల ఉద్యోగులందరికి ప్రభుత్వ ఉద్యోగులకు అమలగుచున్న 62 సంవత్సరాల రిటైర్మెంట్ వయస్సు అమలుపరచాలని డిమాండ్ చేయారు.

ఉద్యోగి సర్వీస్ లో మరణిస్తే ఆ కుటుంబం ఆధారము లేకుండా పోతున్నందున ప్రతి ఉద్యోగికి 20 లక్షలు టర్మ్ ఇస్సూరెన్స్ పాలసీ చేయించి కుటుంబాలకు భరోసా కల్పించాలన్నారు. కొన్ని సంఘాలలో ఉద్యోగుల జీతాలను డ్యూటు నందు ఉంచడం జరిగిందని కార్మికుడు పనిచేస్తే జీతం చెల్లిస్తారు ఆ జీతాన్ని తిరిగి కట్టాలి అనే విధానం ఏ డిపార్ట్మెంట్ లోనూ ఉండదని అందు వలన ఉద్యోగుల డ్యూటు పద్దులను రద్దు చెయ్యాలని కోరారు.

2019 తరువాత సంఘాలలో చేరిన ఉద్యోగులను రెగ్యులర్ చెయ్యాలన్నారు. ప్రస్తుతము పనిచేయుచున్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్స్, క్లర్క్ లను కంప్యూటర్ ఆపరేటర్ సీనియార్టీ ప్రాతిపదికిన జిల్లాలో ఖాళీగా ఉన్న సి.ఇ.ఓ పోస్ట్ లలో వీరిని భర్తీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ ల సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply