ఆర్గాన్ పంటలతో ఆరోగ్యాన్ని కాపాడుకుందాం…

ఆర్గాన్ పంటలతో ఆరోగ్యాన్ని కాపాడుకుందాం…
బూర్గంపాడు, ఆంధ్రప్రభ : ఆర్గాన్ పంటలను పండించి తమ ఆరోగ్యాలను కాపాడుకుందామని భద్రాచలం ఏ.ఎస్. పి. విక్రాంత్ కుమార్ సింగ్ అన్నారు. సోమవారం బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామపంచాయతీ మాజీ ఉప సర్పంచ్ పోతిరెడ్డి వెంకటేష్ రెడ్డి, పినపాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు ఎడమ కండి సుధాకర్ రెడ్డి తో కలిసి ఆర్గాన్ పంటను పండించిన ఎర్రం లక్ష్మిరెడ్డిలు ఐపీఎస్ భద్రాచలం అదనపు పోలీస్ కార్యాలయం లో ఏ ఎస్ పి విక్రాంత్ కుమార్ సింగ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఉత్తమ రైతు యారం లక్ష్మీరెడ్డి పండించిన ఆర్గానిక్ పంటలైన 341 రకం పండుమిర్చి, ఆర్గానిక్ రైస్ ను అందించడంతో వారు పంటలను పరిశీలించారు. త్వరలోనే ఆర్గానిక్ పంటలను సందర్శిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం మందులతో పండుతున్న పంటలు ఆరోగ్యాలను క్షీణింపు చేస్తున్నాయని తద్వారా ఆహారంలోనే కల్తీ జరగడంతో చిన్న వయసు నుంచి ఆసుపత్రిపాలవుతున్నట్లు తెలిపారు.
రైతులు భూమికి బలం చేకూర్చే సేంద్రియ ఎరువులతో ఆర్గాన్ పంటలు పండించి ఆహారాన్ని కాపాడే విధంగా వ్యవసాయం చేస్తే ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా రైతులకు మేలు జరుగుతుందని ఆవారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.
