గ్రామస్తుల సహకారంతో గ్రామ అభివృద్ధిసాధ్యం

గ్రామస్తుల సహకారంతో గ్రామ అభివృద్ధిసాధ్యం

జుక్కల్ (కామారెడ్డి) ఆంధ్రప్రభ : గ్రామ అభివృద్ధికి గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు గ్రామస్తులు తమవంతు సహకారం అందించాలని జుక్కల్ మండలంలోని డోన్ గావ్ గ్రామ సర్పంచ్ ఖానాపూరే శ్రీనివాస్ అన్నారు. గ్రామపంచాయతీలో గ్రామసభ నిర్వహించగా గ్రామ సర్పంచ్ ఖానాపూరే శ్రీనివాస్ అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా ఉపాధి హామీ పనులపై, ఉపాధిహామీ కూలీలహాజరు, జాబ్ కార్డులపై, ఇందిరమ్మ గృహాల పురోగతి, అర్హుల జాబితా, వేసవికాలం దృష్ట్యా మంచినీటి సరఫరా, పారిశుద్ధ్య కార్యక్రమాలు, పచ్చదనం పరిశుభ్రత తదితర అంశాలపై గ్రామసభలు చర్చలు కొనసాగాయి. ఈ సందర్భంగా ఉపసర్పంచ్ హన్ముగొండ, వార్డు సభ్యులు, కార్యదర్శి అంజయ్య, గ్రామస్తులు, గ్రామ స్థాయి ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply