పదవీ బాధ్యతలు చేపట్టిన ఎల్లంపేట మున్సిపల్ నూతన పాలకవర్గం….

పదవీ బాధ్యతలు చేపట్టిన ఎల్లంపేట మున్సిపల్ నూతన పాలకవర్గం….

మేడ్చల్, ఫిబ్రవరి 22(ఆంధ్రప్రభ) : మేడ్చల్ మండలం ఎల్లంపేట మున్సిపాలిటీ కార్యాలయంలో నిర్వహించిన పాలకవర్గ పదవీ బాధ్యతలో భాగంగా చైర్ పర్సన్ గా లావుడియ శ్రీదేవి రమేష్, వైస్ చైర్ పర్సన్ గా రజిత దేవేందర్ రెడ్డిలతో పాటు కౌన్సిలర్లు ఇవాళ పదవీ బాధ్యతలు చేపట్టడం జరిగింది.. ఎల్లంపేట మున్సిపల్ కమిషనర్ స్వామినాయక్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన పాలకవర్గానికి అధికారులు సన్మానించి పుష్పగుచ్చాలతో శుభాకాంక్షలు తెలియజేశారు..

ఈసందర్భంగా చైర్ ప‌ర్సన్ లావుడియ శ్రీదేవి మాట్లాడుతూ.. మున్సిపల్ అభివృద్ధికి పాలకవర్గంతో కలిసి కృషి చేస్తానని తెలిపారు. సమస్యల పరిష్కారం అభివృద్ధి కోస‌మై పార్టీలకతీతంగా కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సద్ది సురేష్ రెడ్డి, భూక్య శారద నాయక్, గుమ్మడిదల మహేశ్వరి, బందెల కుమార్, మాలోత్ రజిత, నీరుగంటి శ్రీలత రమేష్ యాదవ్, గోశిక అఖిల, దుడ్డు కల్పన మాణిక్యం, దాది నరసింహ, ఓం ప్రకాష్ గౌడ్, కత్తి వరలక్ష్మి సురేందర్, చిన్నోళ్ల భాస్కర్, సద్ది నిషితా రెడ్డి వచపల్లి అర్చన, మున్సిపల్ సిబ్బంది, చామకూర మహేందర్ రెడ్డి, గ్రంథాలయ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్, చీర్ల దయానంద్, రాజ మల్లారెడ్డి, మద్దుల శ్రీనివాస్ రెడ్డి, అప్పమ్మ గారి జగన్ రెడ్డి, ఆకిటి నవీన్ రెడ్డి, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply