John Wesley| రాష్ట్రంలో ఆటవిక పాలన

John Wesley| రాష్ట్రంలో ఆటవిక పాలన

  • బడుగు బలహీన వర్గాలపై దాడులా..?
  • చిన్నారి హత్యపై సీఎం స్పందించాలి
  • బాధ్యుల‌ను అరెస్టు చేయాలి
  • బాధిత కుటుంబాన్ని కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే పరామర్శించాలి
  • సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

John Wesley | నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి ఆంధ్రప్రభ : నాగర్ క‌ర్నూల్ మండలం కుమ్మెర గ్రామంలో దేవాలయం జాతర వ‌ద్ద బలహీన వర్గాల కులస్తులపై దాడి, రెండు నెలల చిన్నారి హత్య పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాల‌ని, బాధ్యుల‌ను అరెస్టు చేసి క‌ఠినంగా శిక్షించాల‌ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బాధిత కుటుంబ సభ్యులతో కలిసి చేప‌ట్టిన నిరాహార దీక్ష శిబిరాన్ని సీపీఎం బృందం సందర్శించింది. బాధిత కుటుంబ సభ్యులైన చంద్రకళ గణేష్ మౌనిక తదితరులను పరామర్శించి ఘటన వివరాలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జాన్ వెస్లీ మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి సీపీఎం అండగా ఉంటుందని, చిన్నారి మృతికి కార‌కుల‌ను అరెస్టు చేసేంతవరకు పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు. పార్టీ ఆధ్వ‌ర్యంలో జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చ‌రించారు. చిన్నారి హత్య రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినా ముఖ్యమంత్రి పట్టించుకోవడంలేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో ఆటవిక పాలన కొనసాగుతుంద‌ని విమ‌ర్శించారు. ఈ విషయంపై రాష్ట్ర డిజిపి దృష్టికి తీసుకు వెళ్తామని జాన్ వెస్లీ చెప్పారు బలహీనవర్గాల కుటుంబాన్ని ఇప్పటివరకు ఎస్పీ, కలెక్టర్, ఎమ్మెల్యే పరామర్శించలేదని.. దీని వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికార, పోలీస్ యంత్రాంగం స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని జాన్ వెస్లీ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు సాగర్ శ్రీ రామ్ నాయక్ ఆసన్న, జిల్లా కార్యదర్శి పర్వతాలు నాయకులు కందికొండ గీత, దేశియా నాయక్, ధర్మ నాయక్, ఆంజనేయులు, రామయ్య నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply