అక్రమంగా అవుల తరలింపు

అక్రమంగా అవుల తరలింపు
లక్షేట్టిపేట, ఆంధ్ర ప్రభ: ఎలాంటి అనుమతులు లేకుండా ఎద్దులను అక్రమంగా తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై గోపతి సురేష్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం, ఇటిక్యాల గ్రామంలో పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తుండగా ఎస్ కే గౌస్, ఎస్ కే ఇర్ఫాన్, ఎస్ కే ఆయూబ్ అనే వ్యక్తులు తమ యొక్క మూడు బోలెరో వాహనాలలో ఇరవై మూడు ఎద్దులను (23) ఓవర్ లోడ్ తో క్రూరంగా,కిక్కిరిసి శ్వాస ఆడకుండా ఓవర్ లోడ్ చేసినారన్నారు.
అంతేకాకుండా తాళ్ళతో బంధించి రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. వెటర్నిటీ డాక్టర్ సర్టిఫికెట్ లేకుండా బోలెరో వాహనాలలో ఎద్దులను ఓవర్ లోడ్ చేసి చిల్వకోడూరుకు, మంచిర్యాల మీదుగా తరలిస్తుండగా ఇటిక్యాల గ్రామం వద్ద వాటిని పట్టుకొని గోవుల సంరక్షనార్థం చెన్నూరు గోశాలకు తరలించడం జరిగిందన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరుగుతుందని ఎస్సై పేర్కొన్నారు.
