Minister Kumara Swamy : మంత్రాయంలో కేంద్రమంత్రి సండడి Andhra Prabha News
Minister Kumara Swamy : మంత్రాయంలో కేంద్రమంత్రి సండడి Andhra Prabha News
రాఘవేంద్రస్వామికి ప్రణామం
అనంతరం జోగులాంబ సన్నిధికే పయనం
జిల్లాలో పరిశ్రమల పురోగతిపై మంత్రికి కలెక్టర్ సిరి వివరణ
మంత్రాలయం, ఆంధ్రప్రభ.
కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం కర్నూలు విమానాశ్రయానికి విచ్చేసిన కేంద్ర భారీ పరిశ్రమలు మరియు ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామికి జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి ఆత్మీయ స్వాగతం పలికారు.

తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ అమ్మవారి దేవాలయం, మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి దర్శనం నిమిత్తం కర్నూలు విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర మంత్రిని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి, అదనపు ఎస్పీ హుస్సేన్ పీరా సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మంత్రి రోడ్డు మార్గంలో అలంపురం బయలుదేరి వెళ్లారు.
అలంపురంలో వెలసిన జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో మంత్రి పాల్గొననున్నారు. జిల్లాలో ఏర్పాటు కానున్న పరిశ్రమలు, ఇతర అభివృద్ధి పనుల పురోగతి అంశాలపై జిల్లా కలెక్టర్ మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, డీఎస్పీ బాబు ప్రసాద్ తదితర అధికారులు పాల్గొన్నారు.
